40.2 C
Hyderabad
April 28, 2024 17: 59 PM
Slider జాతీయం

మతమార్పిడి నిరోధక బిల్లుపై రగడ

కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మైనారిటీలను టార్గెట్‌ చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021 ముసాయిదాలో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రతిపాదించారు. ఎస్సీ ,ఎస్టీ , ,మైనర్లు , మహిళలను బలవంతంగా మతమార్పిడి చేస్తే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాను వేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు.

ఇతర వర్గాల వారిని బలవంతంగా మతం మారిస్తే…3 నుంచి 5 ఐదేళ్లవరకు జైలుశిక్ష. 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సామూహికంగా మత మార్పిడులు చేస్తే… 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు.

Related posts

చేపట్టే పనుల వివరాలను మన ఊరు మన బడి వెబ్సైట్లో పొందుపర్చాలి

Satyam NEWS

కవచ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

Satyam NEWS

పీవీకి నివాళి

Satyam NEWS

Leave a Comment