40.2 C
Hyderabad
April 28, 2024 16: 05 PM
Slider విజయనగరం

ఆటో డ్రైవ‌ర్ల‌కు అవ‌ర్నేస్..సీఐ,ఎస్ఐల‌తో పాటు ట్రాఫిక్ డీఎస్పీ….!

#Traffic Police

రోడ్ల‌పై ట్రాఫిక్ జామ్ కు కార‌ణం ఎవ్వ‌రు….?  రోడ్ల‌పై జ‌రిగే ప్ర‌మాదాల‌కు కార‌ణం ఎవ‌రు…?  రోడ్డ‌ను ఆక్ర‌మించుకుంటున్నదెవ్వ‌రు….? 

వీటిన‌న్నింటికి స‌మాధానం ఎవ్వ‌రూ చెప్ప‌లేరు కాని…ఆ ట్రాఫిక్ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించే పోలీస్ రోడ్డు మీద నిల‌బ‌డితే మాత్రం పైన చెప్పిన వ‌న్నీ కాస్త త‌గ్గ‌వ‌చ్చు. స‌రిగ్గా ఆ ప‌నే చేసారు…విజ‌య‌న‌గ‌రం జిల్లా ట్రాఫిక్ పోలీసులు.

జిల్లా కేంద్రంలోని  ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద‌…ఆటో డ్రైవ‌ర్ల‌కు.. ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు. త‌న ఎస్ఐలతో ఒక్క‌సారిగా ప్ర‌త్యక్ష‌మ‌య్యారు. అంత‌కుముందే ప‌ద్మావ‌తీ న‌గ‌ర్ లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ లో త‌న సిబ్బందితో ట్రాఫిక్ విధివిధానాలపై స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం…సీఐ ఎర్రంనాయుడు,ఎస్ఐలు భాస్క‌ర‌రావు,జీయాయుద్దీన్ ల‌తో క‌లిసి ఆర్టీసీ కాంస్లెక్స్ వ‌ద్ద ట్రాఫిక్  విధివిదానాల‌పై అవ‌గాహ‌న చేప‌ట్టారు.

గ‌త రెండు రోజ‌ల నుంచీ  ట్రాఫిక్ సిబ్బంది..అందునా ఎస్ఐలు…మున్సిప‌ల్ కార్పొరేష‌న్ జంక్ష‌న్ వ‌ద్ద తోపుడు బండ్ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. గంట‌స్తంభం నుంచీ పాత బ‌స్టాండ్ వెళ్లే ర‌హదారిలో రోడ్డుకు ఇరువైపు తోపుడు బండ్ల  వాళ్లు..పండ్ల‌తో ఆక్ర‌మించుకోవ‌డంతో గ‌త కొద్ది నెల‌లుగా ఆ జంక్ష‌న్ జామ్ అయ్యేది.

అయితే ఇటీవ‌లే ఎస్ఐ భాస్క‌రావు,ఎస్ఐ జియాయుద్దీన్ లు..రోజు విడిచి రోజు…అక్క‌డి తోపుడు బండ్ల‌పై పండ్ల  అమ్మే వాళ్ల‌లో ప్రాక్టిక‌ల్ గానే అవ‌గాహ‌న‌తో కూడి చైతన్యం క‌ల్పించడంతో…న్యూపూర్ణా జంక్ష‌న్ వ‌ద్ద ట్రాఫిక్ కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకున్నారు.

ఏదైనా ఇన్నాళ్ల‌కు ట్రాఫిక్ పోలీసులు తాము నిర్వ‌హిస్తున్న విధుల‌కు న్యాయం చేకూర్చార‌ని న‌గ‌ర వాసులు  అంటున్నారు

Related posts

క్వారంటైన్ నిబంధన తొలగించిన బ్రిటన్ ప్రభుత్వం

Satyam NEWS

మహిళ మోర్చా ఆధ్వర్యంలో 5000 మాస్కుల పంపిణీ

Satyam NEWS

స్పందన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపండి

Bhavani

Leave a Comment