40.2 C
Hyderabad
May 1, 2024 16: 06 PM
Slider ప్రత్యేకం

ఎల్‌నినో తో ప్రపంచమంతటా ప్రభావం

#El Nino

ఏడాది జులై చివరి నాటికి ఎల్‌నినో పరిస్థితి తిరిగివచ్చే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడల్లో మార్పు చోటు చేసుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తెలిపింది.

అరుదైన రీతిలో వరసగా మూడుసార్లు లానినా తగ్గుముఖం పట్టినా పసిఫిక్‌ మహా సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్‌నినో రానుందని ఈ సంస్థలోని ప్రాంతీయ వాతావరణ అంచనాల విభాగాధిపతి విల్ఫ్రాన్‌ మౌఫౌమా ఓకియా జెనీవాలో విలేకరులకు తెలిపారు. లానినా మూడేళ్లు కొనసాగడం అరుదైన రికార్డుల్లో ఒకటనీ, ఆ పోకడకు ఎల్‌నినో

తెరదించుతుందని చెప్పారు. ఇది జులై నెలాఖరుకు సంభవించడానికి 60%, సెప్టెంబరు మాసాంతానికి వచ్చేందుకు 80% అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో వచ్చినంత మాత్రాన రుతుపవనాల్లో సరైన వర్షాలు కురవబోవని భావించాల్సిన పని లేదని, 1951-2022 మధ్య 15 ఎల్‌నినో ఏడాదుల్లో ఆరుసార్లు సాధారణ వర్షపాతానికి మించి నమోదైందని నిపుణులు పేర్కొంటున్నారు.

Related posts

యుద్ధం కారణంగా అలమటిస్తున్న దేశాలకు ఆహార పదార్ధాలు ఇస్తాం

Satyam NEWS

Analysis: అభ్యర్ధులపై వ్యతిరేకత వల్లే తక్కువ శాతం ఓటింగ్

Satyam NEWS

సిలిండర్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది

Satyam NEWS

Leave a Comment