40.2 C
Hyderabad
April 29, 2024 15: 22 PM
Slider వరంగల్

డాక్టర్ అనితా రెడ్డి కి ఉమెన్ ఎక్స్ లెన్సి -2023 అవార్డు

#anitareddy

క్రాంతి జ్యోతి మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి ఉమెన్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ -2023 ప్రదానోత్సవ కార్యక్రమం పరకాల లోని ఎం. వి. రావు ఫంక్షన్ హాల్ లో నేడు నిర్వహించారుజ ఇందులో భాగంగా ప్రతి జిల్లా నుండి  వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన  మహిళలకు అవార్డులు అందచేసి అతిధుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

ఇందులో భాగంగా  ది నేషనల్ కన్జుమర్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా వినియోగదారుల రక్షణ చట్టం పై విస్తారముగా ప్రజలను చైతన్య పరుస్తూ వివిధ సేవా కార్యక్రమాలు  మహిళలకు, అందులకు, వృద్ధులకు, అనాధలకు, దివ్యాంగులకు , సమాజ హితం కోసం గత 30 సంవత్సరములు గా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ అనితా రెడ్డి కి క్రాంతి జ్యోతి ఉమెన్ ఎక్స్ లెన్స్ అవార్డ్-2023 అందచేశారు.

ముఖ్యంగా అనాధ విద్యార్థులను చదివిస్తూ, మహిళా సాధికారత కోసం వారికి జీవనోపాధి కల్పించే దిశగా వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నందుకు ఈ  పురస్కారాన్ని సంఘం బాధ్యులు డాక్టర్ అనితా రెడ్డి ని అవార్డు తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రతి అవార్డు ఆనందంతో పాటు మరింత బాధ్యత పెంచుతాయని ఇక ముందు కూడా మరిన్ని  ప్రజాహిత కార్యక్రమాలు అవసరార్దులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో  సంస్థ నిర్వాహకురాలు రజిని  రుద్రమ, అతిధులు మాజీ కూడా చైర్మన్ మర్రియాదవ రెడ్డి, దసరా సినిమా ఫేమ్ కళాకారిణి,యాక్టర్  కనకమ్మ, డాక్టర్ సాయి రమేష్, డాక్టర్ రామానుజ స్వామి, కవిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ “ప్రాణం నిల‌వ‌దే..“ విడుద‌ల చేసిన దుల్కర్ స‌ల్మాన్‌

Satyam NEWS

పోలీసుల బెదిరింపుతో వృద్ధ దంపతుల బలవన్మరణం

Satyam NEWS

ఎంపి రఘురామరాజుపై బూతులతో వైసీపీ నేత దాడి

Satyam NEWS

Leave a Comment