38.2 C
Hyderabad
April 29, 2024 21: 00 PM
Slider సంపాదకీయం

సినీ లవ్: చంద్రబాబు బాటలోనే నడుస్తున్న జగన్ బాబు

ys cbn

చంద్రబాబునాయుడి బాటలోనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడిచే ఎస్వీబీసీ భక్తి ఛానెల్ ను సినిమా వాళ్లకు కేటాయించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు. ఆయన బాటలోనే నడుస్తున్న ఇప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఛానెల్ ను సినిమా వాళ్లకే అంకితం చేసినట్లున్నారు.

ఎస్వీబీసీ ఛానెల్ కు సిని రంగానికి చెందిన వారినే నియమించాలనే నిబంధన పాటిస్తూ గతంలో సినీ దర్శకుడు రాఘవేంద్ర రావును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియమించారు. అప్పుడే చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చాయి. సినిమాలు తీయడంలో అనుభవం ఉన్నంత మాత్రాన రాఘవేంద్రరావు లాంటి కమర్షియల్ డైరెక్టర్ ను భక్తి ఛానెల్ కు నియమిస్తారా అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.

అలా ప్రశ్నించిన వారిలో వైసిపి నాయకులు కూడా ఉన్నారు. అయితే అధికారంలోకి రాగానే వెనుకా ముందూ ఆలోచించకుండా పృథ్వి అనే సినిమా నటుడిని ఆ స్థానంలో వై ఎస్ జగన్ నియమించేశారు. ఆ తర్వాత కథ తెలిసిందే పైకి మొహంపై నామాలు పెట్టుకున్నా రాసలీలలు చేస్తూ ఫోన్ లో దొరికిపోయాడు పృథ్వి. దాంతో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ చేయించాల్సి వచ్చింది.

విచారణలో నిజమని తేలడంతో పృథ్విని పదవి నుంచి బయటకు పంపాల్సి వచ్చింది. పెయిడ్ ఆర్టిస్టు అయి ఉండి అమరావతి రైతులను కూడా పెయిడ్ ఆర్టిస్టులని విమర్శించి తన ప్రభు భక్తిని చాటి చెప్పుకుందామనుకున్న పృథ్విని  పదవి నుంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో సినీ దర్శకుడిని ఆ పోస్టుకు ప్రతిపాదిస్తున్నారట. కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా, రాగల 24 గంటలు లాంటి సినిమాలు తీసిన శ్రీనివాస్ రెడ్డి ని ఈ పోస్టుకు ప్రతిపాదిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు లాగా మీరు కూడా ఈ భక్తి ఛానెల్ బాధ్యతలను సినిమావారికే ఇస్తారా? భక్తి ఛానెల్ నడిపేందుకు ఇలాంటి కమర్షియల్ సినీ డైరెక్టర్లు అవసరమా? హిందూ ధర్మాన్ని చాటి చెప్పడం, వేంకటేశ్వరుడి కార్యక్రమాలు చూపించడానికి రాజకీయ నిరుద్యోగులు అవసరమా? అదేమన్నా పొలిటికల్ పోస్టా?  

Related posts

గ్లామరస్ ‘పాపతో పైలం’… ‘హంట్’లో ప్రత్యేక గీతం విడుదల

Satyam NEWS

మదన్ మోహన్ రావుకే టీడీపీ మద్దతు

Satyam NEWS

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

Satyam NEWS

Leave a Comment