31.2 C
Hyderabad
May 3, 2024 03: 03 AM
Slider ప్రత్యేకం

జగన్ లేఖ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్

#YSJaganmohanreddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ కు సంబంధించిన కేసు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు యు లలిత్ తప్పుకున్నారు.

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ కేసులు నమోదు అయిన సందర్భంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యు యు లలిత్ అప్పటిలో న్యాయవాదిగా ఆయన తరపున వాదించారు. నాంపల్లి కోర్టులో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున వాదించిన యు యు లలిత్ ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.

తాను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అడ్వకేట్ గా ఉన్నందున ఈ కేసును తాను విచారించలేనని యు యు లలిత్ కేసు నుంచి తప్పుకున్నారు. అందువల్ల తాను లేకుండా ఉండే బెంచ్ కి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ కేసును అప్పగించాలని జస్టిస్ యు యు లలిత్ ప్రధాన న్యాయమూర్తి ని కోరారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కొందరిని తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు కాగా వాటిని విచారించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు యు లలిత్ బెంచ్ ముందుకు వచ్చాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను విమర్శించే హక్కు అధికారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేవని, న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కోరుతూ న్యాయ వాది జి ఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నది.

రాజ్యాంగ పదవిలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిధిని దాటి న్యాయవ్యవస్థ పై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారని, రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు సాహసించారని పిటిషనర్ ఆరోపించారు.

న్యాయవ్యవస్థ పట్ల భారత దేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేసే విధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, కొన్ని కేసులు కోర్టు విచారణ పరిధిలో ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి న్యాయవ్యవస్థ పై బురద చల్లేందుకు ఈ విధమైన ఆరోపణలు చేశారని పిటిషనర్ తెలిపారు.

రెండో పిటిషన్ ను సునీల్ కుమార్ సింగ్ తరపున ఎడ్వకేట్ ఆర్ రికార్డ్ ముక్తి సింగ్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా లేఖలు రాసి వాటిని బహిరంగ పరచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆయన కోరారు. ఇప్పుడు జస్టిస్ యు యు లలిత్ తప్పుకోవడంతో మరో బెంచ్ ముందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులు వెళతాయి.

Related posts

చేనేత మిత్ర పథకం అమలుపరిచిన ఘనత కేటీఆర్ దే

Satyam NEWS

గురుకుల పాఠశాల పిన్సిపల్ వార్డెన్ల తొలగింపు

Satyam NEWS

శాడ్: ఇంకో వారంలో పెళ్లి ఇంతలోనే మర్డర్

Satyam NEWS

Leave a Comment