30.3 C
Hyderabad
March 15, 2025 10: 12 AM
Slider విజయనగరం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేత కుమారుడు

#Road Accedent

స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వైసీపీ నేత కుమారుడి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేర్చారు. విజయనగరం లోని ధర్మపురి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమారుడు ప్రణీత్ (15) ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు లోనయ్యాడు.

ప్రణీత్  తలకు బలమైన గాయాలు తగిలాయి. తన స్నేహితుడితో కలసి మోటారు సైకిల్ నడుపుతుండగా లారీ ఢీకొని ప్రమాదం జరిగింది. వెంటనే విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించి చికిత్స చేయించారు.

కొద్ది సేపటి కిందట విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు ప్రకటించారు. చిన్నశ్రీను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు అవుతాడు.

Related posts

తల్లితో బాటే అనంత లోకాలకు తరలిన కొడుకు

Satyam NEWS

ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు కరోనా

Satyam NEWS

భారత యోధుడు

Satyam NEWS

Leave a Comment