31.7 C
Hyderabad
May 2, 2024 07: 34 AM
Slider ముఖ్యంశాలు

అశోక్ గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపి

#majjisrinivasarao

మూడేళ్ల ల్లో కేంద్ర మాజీ మంత్రి  ప్రజల్లో తిరగలేదు..మరి సమస్యలు ఎలా తెలుస్తాయి..?

అన్న దాతలకు అండగా  నిలుస్తూ డా.వై.ఎస్.ఆర్ .ఉచిత పంటల బీమా పధకం క్రింద 2021  ఖరీఫ్ పంట లో నష్టపోయిన  రైతన్నలకు ఈ ఖరీఫ్ ప్రారంభం లోనే  పంటల నష్ట పరిహారాన్ని  రైతుల ఖాతాల్లో జమ చేసారు సీఎం జగన్. ఈ మేరకు శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి లో  జరిగిన సమావేశం నుండి  బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసారు.

ఇక విజయనగరం జిల్లాలో  ఉచిత పంటల బీమా పధకం క్రింద పంట కోత ప్రయోగములలో తక్కువ దిగుబడి వచ్చ్జ్హిన గ్రామాలలో గల 9361  మంది రైతుల కు బీమా పరిహారంగా 9.36 కోట్ల రూపాయలను  వారి ఖాతాలలో అమ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమానికి విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం నుండి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు , ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్,   శాసన మండలి సభ్యులు డా.సురేష్  బాబు,  ఎమ్మెల్యే కంబాల జోగులు, డీసీసీబి చైర్మన్,  వ్యవసాయ మార్కెటింగ్  చైర్మన్ లు, జిల్లా వ్యవసాయ అధికారి తారక  రామారావు  రైతులకు మెగా చెక్కును అందజేసారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ జిల్లాలో తక్కువ పంట నష్టం జరగడానికి ప్రకృతి ఒక కారణం అయితే  జరిగిన నష్టాన్ని  ఖరీఫ్ ప్రారంభానికి ముందే  పరిహారంగా అందజేసి ముఖ్యమంత్రి  రైతులకు వరంగా నిలిచారని పేర్కొన్నారు.  ఒకప్పుడు ఈ పరిహారం కోసం రైతులు సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారని,  గత మూడేళ్ళుగా  ఆ పరిస్థితి మారిందని, ఎప్పటి పరిహారం అప్పుడే  అందజేస్తూ రైతుల పాలిట తన ప్రేమను  చాటు కన్నారని  అన్నారు. 

అంతే కాకుండా  జిల్లా రైతుల నుండి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేసి  సుమారు 715 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మొక్క జొన్న కు కూడా మద్దత్తు ధర ప్రకటించి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  జిల్లా లోని మంత్రి వర్యుల, ఇతర  ప్రజాప్రతినిధుల, అధికారుల  సమన్వయం తో రైతుల కు మేలు చేసే  కార్యక్రమాలు జరగుతున్నాయని తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గత మూడేళ్ళు గా సెలవులో ఉన్నారని, ప్రజలకు దూరంగా ఉండడం వలన ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదని అన్నారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసారని  అశోక్ అన్నారని,  నాడు –నేడు పాఠశాలలను చూసి మాట్లాడాలని అన్నారు.  ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల  పట్ల స్పందిస్తూ పని చేస్తున్నామని , గత మూడేళ్ళలో ప్రజలతో సత్సంబంధాలు కోల్పయిన అశోక్ కు మాట్లాడే అర్హత లేదని  ఎద్దేవా చేసారు.

Related posts

బత్తాయి పండ్లు పంచిన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్

Satyam NEWS

మసీదు నిర్మాణానికి వేరే చోట 5 ఎకరాల చోటు

Satyam NEWS

మునిసిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్

Satyam NEWS

Leave a Comment