ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న అధికార వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నలుగురిని అనధికారికంగా వైసీపీ తన పార్టీలో చేర్చుకుంది. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో తన సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు చేసినట్లు వైసీపీ నిర్ధారించుకుంది. దాంతో ఆ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. వైసీపీ సస్పెండ్ చేసిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటిచంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వైసీపీ నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
previous post
next post