39.2 C
Hyderabad
April 28, 2024 11: 53 AM
Slider జాతీయం

దేశంలో యెల్లో ఫంగస్ :ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో గుర్తింపు

yellow fungus found in ghajiabad of uttar pradesh

కరోనా పుణ్యమా అని భారత దేశ ప్రజలు కొత్త కొత్త ఫంగస్‌ల బారినపడి త్రీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దేశం లో ఇప్పటికే అనేక మంది కొవిడ్‌ రోగులు బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ బారిన పడగా, తాజాగా ఎల్లో ఫంగస్‌ను గుర్తించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వ్యక్తికి ఎల్లో ఫంగస్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కంటే ఎల్లో ఫంగస్‌ ఎంతో ప్రమాదకరమైనదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వ్యాధి బారిన పడిన వ్యక్తి ఈఎన్‌టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఎల్లో ఫంగస్‌ బారిన పడిన వ్యక్తుల్లో బద్ధకం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో గాయాలు ఏర్పడితే అవి తీవ్రమవుతాయి. వాటి నుంచి చీము కారుతుంది. దీంతో నివారణ కష్టంగా ఉంటుంది. కణజాలం దెబ్బతినడంతో కళ్లకు తీవ్ర హాని కలుగుతుంది. లక్షణాల ను గుర్తించిన వెంటనే చికిత్స పొందకపోతే వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఆంఫోటెరిసిన్‌-బి ఔషధమే ఇప్పుడు ఈ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్స. కాగా అపరిశుభ్రతే ఈ వ్యాధి సోకేందుకు ప్రధాన కారణమని, ఇంటి పరిసర ప్రాం తాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకో వడం చాలా ముఖ్యమని, పాచిన ఆహార పదార్థాలు, మల విసర్జితాలను తొలగిం చడం ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరుగుదలను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫంగస్‌ పెరుగుదలలో ఇంటిలోని తేమ కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు.

Related posts

సంస్థాన్ నారాయణపురం లో మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం

Bhavani

అప్పుల కుప్ప: ఏపి రుణపరిమితి కట్టడి చేస్తున్న కేంద్రం

Satyam NEWS

9న నరసరావుపేట లో ఇస్కాన్‌ జగన్నాథ రథోత్సవం

Satyam NEWS

Leave a Comment