స్వామి వివేకానందుడు చూపిన మార్గంలో యువత నడవాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గంగు వెంకటరమణ, గుండబాల మోహన్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ జనవరి 12 కేవలం ఒక తేదీ కాదని అది స్వామి వివేకానందుడు జన్మించిన ఒక పవిత్ర దినమని అన్నారు.
నేటి యువత సులభంగా చెడు మార్గాలలో వెళుతున్నదని వారు ఒక్క సారి వివేకానందుడి బోధనలు వింటే తమ జీవితాన్ని తాము మార్చుకోగలుగుతారని వారన్నారు. యువత పరివర్తన చెందితే దేశం పురోగమిస్తుందని వారు తెలిపారు. వివేకానందుడి జయంతి సందర్భంగా వారు విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.