35.2 C
Hyderabad
May 1, 2024 02: 46 AM
Slider ముఖ్యంశాలు

సాలిడారిటీ: పోలీసులు ఎక్కడున్నా పోలీసులే

solidarity

రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ఉండాలని కోరుకోని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాలు ఉంటే కూడా ప్రజలు సహించలేరు. తెలంగాణతో పోరాడాలని నిర్ణయించుకున్న చంద్రబాబును అధికారం నుంచి సాగనంపింది కూడా అందుకే. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ సిఎం కేసీఆర్ తో కలిసి పని చేయడం చాలా మందికి ఆనందం కలిగించింది కూడా.

అయితే ఇప్పుడు ఈ కలయికే ముప్పుగా మారుతున్నది. అమరావతిలో రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా సెటిలర్లు అధికంగా ఉన్న కూకట్ పల్లి ప్రాంతంలో నిరసన ప్రదర్శన జరిపారు కొందరు యువకులు. కేవలం ఆంధ్రా ప్రాంతంలో అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వారికి సంఘీభావం తెలుపడం ఒక్కటే వారి ఉద్దేశ్యం. కొద్ది సేపు నినాదాలు చేసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేసిన తర్వాత వెళ్లిపోదామనుకున్నారు.

అయితే కూకట్ పల్లి పోలీసులు అడ్డు తగిలారు. అమరావతి రైతులకు సంఘీభావం వ్యక్తం చేయకుండా కూకట్ పల్లి యువకులను అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమరావతిలో ఆంధ్రా పోలీసులు ఇలానే చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేస్తున్నారు.

అదే బాటలో కూకట్ పల్లి పోలీసులు కూడా నడవడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రాలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేసినా కూడా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలూ కలిసి ఉండాలని కోరుకున్నాం కానీ ఇలా రెండు రాష్ట్రాల పోలీసులు కలిసి పని చేస్తారని తాము ఊహించలేదని సంఘీభావం చెప్పేందుకు వచ్చిన ఆంధ్రా సెటిలర్లు వ్యాఖ్యానించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రా వారిపై ఇదే వైఖరి కొనసాగిస్తే రాబోయే మునిసిపల్ ఎన్నికలపై ఆంధ్రా సెటిలర్లు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలలో తీవ్ర ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

Related posts

ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు 24న ఛలో అసెంబ్లీ

Satyam NEWS

ఘనంగా కోడి రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకలు

Satyam NEWS

శ్రీశైలం లో దసరా మహోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment