రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన చట్టం అమలు కాకపోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసమర్థతే కారణమని ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే టిడిపి, బీజేపీ నేతలకు బాధ ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనాచౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలు వెలికి తీస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. పూటకో మాట మాట్లాడే పవన్‌కి జనం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదని మల్లాది విష్ణు అన్నారు.
previous post