27.7 C
Hyderabad
April 26, 2024 06: 02 AM
Slider ప్రత్యేకం

ఈ జీవాయుధాన్ని నిర్వీర్యం చేయడం మన చేతుల్లోనే ఉంది

bio wepan

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కరోనా వైరస్ ఇప్పుడు తాజాగా ఒక్క సారిగా పుట్టింది కాదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. కరోనా వైరస్ ను 1960లో మొట్టమొదటి సారిగా కోడి లో కనుక్కున్నారు. అప్పటి నుంచి పలు రకాల మార్పులకు ఈ వైరస్ గురైంది. కరోనా వైరస్ వల్ల ఫ్లూ లాంటి జబ్బులు వస్తాయని ముందుగా భావించారు.

కానీ 2002 లో SARS CoV అనే కరోనాa వైరస్ వల్ల న్యుమోనియాతో చాలామంది మరణించారు. అలాగే 2012 లో నోవెల్ కరోనా 2012 వల్ల మధ్య ప్రాచ్య దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో న్యుమోనియా వ్యాధి సోకింది. ఈ సారి కూడా చాలామంది మరణించారు. 2014 లో దానికి MERS-CoV అని పేరు పెట్టారు.

దానివల్ల అడపాదడపా అంటే 2013 లో, 2015 లో, 2018 లో మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చింది Novel Corona Virus 2 ( or SARS CoV2), దాన్నే మనం COVID 19 గా పిలుస్తున్నాం. ఇది మొత్తంగా 2002 లో సోకిన కరోనా వైరస్ లానే ఉంది. అయితే ఇది తొలి సారి కొనుగొన్న కరోనా వైరస్ కి 96% మాత్రమే మ్యాచ్ అయింది.

అలాగే పంగోలిన్ అనే జంతువులలో కనపడే కరోనా జీనోమ్ కి 92% సరిపోతున్నది. వైరస్ లు virulent (వ్యాప్తి చెందేవి) గాను, infective (సోకే లక్షణం) గాను ఉంటాయి. Virulence ఎక్కువగా ఉంటే వ్యాధి కనిపించిన వెంటనే చనిపోతారు. ఇలాంటి వైరస్ లు వ్యాపించే గుణం తక్కువగా కలిగి ఉంటాయి.

Infective లక్షణాలు ఎక్కువగా ఉన్న వైరస్ లు శరీరంలో చేరిన తర్వాత చాలా రోజులకు జబ్బు లక్షణాలు తెలుస్తాయి. దీంతో ఇది ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. మరణాలు తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా వైరస్ కు వ్యాపించే లక్షణం ఎక్కువగా ఉన్నందునే ఇది చైనా ప్రయోగించిన జీవాయుధం (బయో వెపన్) అని అనుకోవాల్సి వస్తున్నది.

చాలా మంది అలానే అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా జీవాయుధంగా ఉన్న వైరస్ లనే వాడతారు తప్ప కొత్త వైరస్ లను కనుక్కొని మరీ వాడేంత సానుకూలత ఉండదనే వాదన కూడా వినిపిస్తుంటుంది.

కరోనా వైరస్ లో L or S అని 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది L type అంటే severe type of virus. అది అన్ని దేశాల్లో ఓకే విధంగా ఉంది. ఏ వైరస్ అయినా సరే మాధ్యమం (మీడియం) ఉంటేనే వ్యాపిస్తుంది. కరోనా వైరస్ కు మాధ్యమం అంటే మానవ శరీరం.

ఈ మాధ్యమం తో బాటు వైరస్ పెరిగేందుకు అనుకూల వాతావరణం కూడా ఉండాలి. ఇప్పుడు మాధ్యమం విషయానికి వస్తే మానవులలో innate immunity, adaptive immunity అనే రెండు రకాలు ఉంటాయి. Innate immunity అంటే ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు వాటిని చంపేసి, మింగేసి నిర్వీర్యం చేస్తాయి.

 సహజంగా మన దేశంలో నివసించే వారికి innate immunity కొంచం ఎక్కువ. ఎందుకంటే మన దేశంలో కాలుష్యం, కల్తీ పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సహజంగానే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఉంటుంది. రెండోది adaptive immunity. దీనికి కొంచెం సమయం పడుతుంది.

అంటే మన శరీరం వైరస్ తత్వాన్ని అర్థం చేసుకొని దాని బలహీనతలను కనిపెట్టి దానిపై పోరాటం చేసి నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. దీనికి రక్తం లోని లింఫోసైట్స్ ఉపయోగపడతాయి. ఇది కొంచం నిదానంగా పని చేసినా దీనివల్ల మన శరీరం సంబంధిత వైరస్ ను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఇంకోసారి అది మళ్లీ దాడి చేసినప్పుడు తొందరగా, సమర్థంగా ఎదుర్కొంటుంది.

వాక్సీన్లు (టీకాలు) ఈ సిద్ధాంతంపైనే తయారు చేస్తారు. మనకు covid 19 విషయంలో ఇది అంతా త్వరగా జరిగేది కాదు. అలాగే మన జీన్స్ మార్పుల వల్ల ఏ వైరస్ అయినా మన దేశానికి చెందిన వారిలో ఎక్కువ ప్రభావం చుపకపోవచ్చని ఒక విశ్లేషణ.

ఎందుకంటే ఇక్కడ కాలుష్యం ఎక్కువ కాబట్టి. అదే విధంగా మన దేశంలో మలేరియా ఎక్కువ కాబట్టి మనం క్లోరోక్విన్ మందులను ఎక్కువగా వాడతాం. దీనివల్ల కూడా కోవిడ్ 19 మన శరీర కణాలలోకి ప్రవేశించడానికి (ఇతర దేశాల వారితో పోలిస్తే) సమయం పడుతున్నదని ఇంకో విశ్లేషణ.

ఇక పర్యావరణ విషయాలకు వస్తే మన దేశానికి కలిసి వచ్చే విషయం ఇక్కడి ఉష్ణోగ్రత. కోవిడ్ 19 వైరస్ 28 డిగ్రీల సెల్షియస్ లో నిర్వీర్యం అవుతుంది. మానవ శరీరం నుంచి బయటకు వచ్చి మరో మానవ శరీరం కాకుండా మరో మాధ్యమం పై పడినప్పుడు తొందరగా నశిస్తుంది.

మనిషి మనిషి దగ్గరగా ఉంటే కోవిడ్ 19 త్వరగా వ్యాపిస్తుంది. అందుకే మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని పదే పదే చెబుతున్నది. ఇలా దూరం పాటించడం ద్వారా దీన్ని వ్యాప్తిని నిరోధించవచ్చు. 65 పైబడ్డ వయసులో అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ధూమ పానం చేసేవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అదే విధంగా క్యాన్సర్ చికిత్సకు కీమో థెరపీ తీసుకునే వారికి, ఆస్తమా రోగులకు, ఉత్ర్పేరకాలు (స్టెరాయిడ్లు) వాడేవారికి రోగనిరోధక శక్తి పూర్తిగా నశించి ఉంటుంది. అందువల్ల అలాంటి వాళ్లకు కోవిడ్ 19 సోకితే ఎక్కువ మంది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది.

మన దేశంలో ఉన్న జనాభా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఒక్కటే కష్టమైన విషయం. ఆ ఒక్కటీ పాటిస్తే ఈ బయో వెపన్ మనలను ఏమీ చేయలేదు. అందుకే ప్రధాని మోడీ దేశం మొత్తంలో లాక్ డౌన్ ప్రకటించారు.

లాక్ డౌన్ 21 రోజులు పాటిస్తే ఈ వైరస్ మన దేశంలో అంతరించి పోతుంది. ఈ లోపు దానికి మళ్లీ మాధ్యమం దొరికితే పరిస్థితి మళ్లీ మొదటకు వస్తుంది. అందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనమే.

డాక్టర్ బండారు

Related posts

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారు

Satyam NEWS

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన

Satyam NEWS

Leave a Comment