37.2 C
Hyderabad
April 26, 2024 21: 47 PM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో ఇక మిగిలింది 20 శాతమే

ram-gopal-varma

వికృత రాజకీయ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు ఈ సారి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. నవంబర్ 29న పేరు మార్చిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని విడుదల చేస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఆ తేదీకి చిత్రాన్ని విడుదల చేయలేకపోయాడు.

హైకోర్టులో కేసు విచారణలో ఉండటం, సెన్సార్ పూర్తి కాకపోవడం తదితర కారణాలతో రామ్ గోపాల్ వర్మ చిత్రం వెలుగు చూడలేకపోయింది. ఇది రామ్ గోపాల్ వర్మకు తొలి పెద్ద దెబ్బ. రాజకీయ చిత్రాలు తీసి సంచలనం సృష్టించాలనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ తన చిత్రాన్ని విడుదల చేయలేకపోవడం పై ఫిలిమ్ నగర్ వర్గాల్లో విస్తృతంగా చర్చించుకున్నారు.

హైకోర్టు సూచనతో సెన్సార్ బోర్డు వారు చిత్రాన్ని చూశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే ఈ రాజకీయ చిత్రం కు సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. అంతే కాకుండా దాదాపు 80 శాతం చిత్రానికి కట్ లు ప్రతిపాదించినట్లు కూడా తెలిసింది. దాంతో రామ్ గోపాల్ వర్మకు  చుక్కలు కనిపించాయి.

సెన్సార్ బోర్డు సూచించినట్లు కట్ లు అమలు చేస్తే 20 శాతం చిత్రం మాత్రమే మిగులుతుంది. ఈ కారణంతో రామ్ గోపాల్ వర్మ రివ్యూ కమిటీకి చిత్రాన్ని రిఫర్ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. రివ్యూ కమిటీ ఏం చెబుతుందో తెలియదు. అప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మకు టెన్షన్ తప్పదు. తన వికృత రాజకీయ చిత్రాలతో అందరికి టెన్షన్ తెప్పించిన రామ్ గోపాల్ వర్మకు ఈ సారి ఇలా టెన్షన్ పుట్టింది.

Related posts

తొలితరం ఉద్యమకారుడు చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కేంద్రం కసరత్తులు..

Sub Editor

తిమ్మప్ప స్వామికి అరకిలో వెండి బహుకరణ

Bhavani

Leave a Comment