42.2 C
Hyderabad
April 26, 2024 17: 39 PM
Slider జాతీయం

నిర్భయ నిందితులకు 16న ఉరి శిక్ష అమలు

Nirbhaya sweets

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈనెల 16న (సోమవారం) ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు తెలిపారు.

ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు జైలు అధికారులు తెలిపారు. తిహార్‌ జైలులోనే వారిని ఉరి తీయనున్నారు. దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో  ఉరిశిక్షకు లైన్‌క్లియర్‌ అయ్యింది.

2012 డిసెంబర్‌ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం.  దోషుల్లో ఒకరు జూవైనల్‌ కస్టడీలో ఉండగా మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

నిర్భయ దోషులకు ఉరి ఖరారు కావడంతో దేశ వ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా స్వీట్లు పంచుకున్నారు.

Related posts

శంషాబాద్ హోటల్ లో విద్యార్ధి ఆత్మహత్య

Satyam NEWS

మాప‌వ మ‌నుగ‌డ‌కు మూలాధారం గాలి, నీరు

Sub Editor

(NEW) What Is The Best Medication To Lower Diastolic Blood Pressure Potassium Supplementation Lowers Blood Pressure Does Rogaine Lower Your Blood Pressure

Bhavani

Leave a Comment