40.2 C
Hyderabad
April 26, 2024 12: 54 PM
Slider ముఖ్యంశాలు

నాంపల్లి కోర్టులో హాజరైన మాజీ ఎంపీ కవిత

kavitha nampally

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విచారణ నిమిత్తం మాజీ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాంపల్లి ప్రత్యేక కోర్టుకు నేడు వచ్చారు. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు ఆమె విచారణకు హాజరయ్యారు.

2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సందర్భంగా జరిగిన ఉపఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా  అధ్యక్షురాలు కవిత, నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు.

అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేసిన కారణంగా ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి, వ్యక్తిగత పూచీకత్తు పదివేల రూపాయలు బాండ్ సమర్పించాలని, తిరిగి వచ్చే నెల 19 న హాజరు కావాలని న్యాయమూర్తి  ఆదేశించారు.

Related posts

ఉమ్మడి మాచారెడ్డిలో రేపు రేవంత్ రెడ్డి ప్రచారం

Satyam NEWS

మీ టీవీ రేటెంత? అమ్మో 14 లక్షలా?

Satyam NEWS

రుణ మాఫీ కోసం సొసైటీ మహా జన సభ తీర్మానం

Satyam NEWS

Leave a Comment