28.7 C
Hyderabad
April 27, 2024 05: 33 AM
Slider ప్రత్యేకం

మానియాక్: తల్లి వయసు ఆంటీతో భార్య ఎదుటే సరసాలు

manic

వాడో రాజకీయ నాయకుడు. అందరికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శం గా ఉండటం సంగతి ఎలా ఉన్నా అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాలన్నీ వేరే వారెవరో కాదు. అతడి భార్యే చెబుతున్నది. అందమైన భార్య ఇంట్లో ఉండగానే ఓ ఆంటీతో సరసాలు సాగిస్తున్నాడు.

ఆస్తి మొత్తం దోచి ఆమెకే పెడుతున్నాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఘనుడి పేరు సారధి కుమార్. ఇతను వడియంబాడి నగర డీఎంకే కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చెన్నైలోని అడయార్ ఇందిరానగర్ కు చెందిన రమ్యకు వడియంబాడికి చెందిన సారధికుమార్ తో 2016లో వివాహం జరిగింది. సారధి కుమార్ పొలిటికల్ పార్టీలో ఉండటంతో సహజంగానే పలువురు ప్రముఖులతో పాటు పలుకుబడిగల రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే సారధి కుమార్ కు సేలంకు చెందిన ఒక ఆంటీతో పరిచయం ఏర్పడింది. తన భర్త కంటే ఆ మహిళ 15 ఏళ్లు పెద్దదని అయినా సారధికుమార్ ఆమె మోజులో పడిపోయాడని రమ్య ఆరోపించింది. సేలం ఆంటీ మోజులో పడిన సారధి కుమార్ రమ్యకు చెందిన 14 సవర్ల బంగారు నగలు తాకట్టు పెట్టాడు.

తాకట్టు పెట్టగా వచ్చిన నగదు తీసుకువెళ్లి అక్రమ సంబంధం సాగిస్తున్న ఆంటీకి ఇచ్చినట్లు రమ్య తెలిపింది. తండ్రి తన పేరున రాసిన ఆస్తిని కూడా అమ్మి ఆంటీకి సమర్పించాడని చెప్పింది. ఇన్నాళ్లు గుట్టుగా బయట సాగిన వ్యవహారం ఇప్పుడు ఇంటిలోకి వచ్చి భార్య ముందే ఆంటీతో సరసాలాడుతుంటే సహించలేని భార్య తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

భర్త ఆంటీ తో కలిసి ఉన్న ఫోటోలను రమ్య పోలీసు కమీషనర్ కు అందించింది. ఇన్నాళ్లు పరువుపోతుందనే భయంతో భర్త చేసే కార్యకలాపాలు అన్నీ భరించానని భర్త బరి తెగించి ఆంటీని ఇంటికి తీసుకువచ్చి తన ముందే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేకపోయానని వాపోయింది. ప్రశ్నిస్తే తనను చంపుతానని బెదిరించాడని, తన అత్తగారు కూడా భర్తనే సపోర్టు చేస్తోందని కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. సారధి కుమార్ మీద స్ధానిక అరివాలయం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా భర్త మార్గం మధ్యలో అడ్డగించి తన మెడపై కత్తి పెట్టి ఫిర్యాదు వెనక్కి తీసుకోక పోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రమ్య పోలీసు కమీషనర్ ను కోరింది. డీఎంకే నేత అరాచకాలు తెలుసుకున్న కమీషనర్, కేసు నమోదు చేసి విచారణ చేయాలని స్ధానిక పోలీసులను ఆదేశించారు.

Related posts

ప్రమోషన్:ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్

Satyam NEWS

సోషల్ మీడియాపై పాత కక్షలు తీర్చుకుంటున్నారు

Satyam NEWS

మరి కొద్ది రోజులు బయటకు రాకండి ప్లీజ్

Satyam NEWS

Leave a Comment