28.7 C
Hyderabad
April 26, 2024 09: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ రాక్షసులు

kanakadurka temple

ప్రభుత్వాలు మారినా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో రాజకీయాల పరిస్థితి మాత్రం మారడం లేదు. దేవస్థానం పరిపాలనా బాధ్యతలు స్వీకరించే ఏ అధికారి కూడా ఏడాదికి మించి ఉండలేకపోతున్నారు. దుర్గ గుడి పోస్టింగులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తెచ్చుకుంటున్న అధికారులు వారి చేతుల్లో పావులుగా మారిపోతున్నారు. రాజకీయ నాయకులు తమ శక్తి కొద్ది  కార్యనిర్వాహక అధికారులను ఆడిస్తున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలే కాదు స్థానిక రాజకీయ నాయకులు కూడా దుర్గ గుడిపై తమ ఆధిపత్యమే ఉండాలని ఆశిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య దుర్గమ్మ నలిగిపోతున్నది. దుర్గమ్మ సన్నిధిలో గతంలో క్షుద్ర పూజలు జరిగాయనే విషయం బయటకు రావడంతో ఒక ఇవోను బదిలీ చేశారు. తర్వాత కనకదుర్గమ్మ చీర పోయినందుకు మరో ఇవో బదిలీ అయ్యారు. విచిత్రం ఏమిటంటే కనకదుర్గం దగ్గరకు వచ్చే అధికారులు రాజకీయ ప్రమేయంతోనే వస్తున్నారు, రాజకీయ ప్రమేయంతోనే పోతున్నారు. అమ్మవారు మాత్రం తాను నిమిత్తమాత్రురాలిగా మిగిలిపోతున్నది. అంతా అవినీతి జరుగుతున్నట్లు వార్తలు వస్తుంటున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. ప్రస్తుతం ఉన్న ఇవో పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా లేదు. ప్రస్తుతం ఉన్న ఇవో తెలుగుదేశం హయాంలో నియమితురాలు కావడంతో ఆమె పై ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్ధి రాజకీయ నాయకులు తామేం తక్కువ తినలేదని నిరూపిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ప్రస్తుత ఇవో కోటీశ్వరమ్మ బదిలీ ఇంకా కాలేదు. ఐఆర్ఎస్ అధికారి కావడం వల్ల జిఏడీ నుంచి ఆదేశాలు వెలువడేందుకు ఆలశ్యం కావడంతో బదిలీని ఎలాగైనా నిలుపుదల చేయించాలని మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ సారి వెరైటీగా తెలుగుదేశం వారు కాకుండా జనసేన నాయకుడు ఇవోకు అనుకూలంగా మంత్రికి వ్యతిరేకంగా తన వాదన వినిపిస్తున్నారు. మంత్రి చెప్పిన పనులు చేయడం లేదని విజయవాడ కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటీశ్వరమ్మను బదిలీ చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. పారదర్శకంగా పాలన అందిస్తున్న దుర్గ గుడి ఈవో పై ప్రభుత్వం కక్ష కట్టటం దారుణమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ఆయన మంత్రిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే దసరాకి దోచుకోటానికే ఈవో పై బదిలీ వేటు వేస్తున్నారని అంటున్నారు. గత దసరాకి 6 నుండి 7 కోట్లు ఖర్చు అయితే ఈ  దసరాకి 20 కోట్లు ఖర్చు చేసి దోచుకోవాలని మంత్రి వెల్లంపల్లి చూస్తున్నాడని పోతిన మహేష్ ఆరోపిస్తున్నారు. తనకు అనుకూల వర్గాన్ని దుర్గగుడి లో పోస్టింగ్ వేసి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయాలని మంత్రి చూస్తున్నాడని, సంవత్సరం తీరగకుండా నే ఈవో కొటేశ్వరమ్మ ని బదిలీ చేయాటానికి కారణం మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాతల సహకారం తో  దుర్గ గుడిలో నిర్మాణాలు జరుగుతుంటే దాతల దగ్గర కూడా కమిషన్ లు అడగటం సిగ్గు చేటు…అసంపూర్తిగా ఉన్న రాతి మండపము నిర్మాణం కి 7 కోట్లు బిల్స్  రిలీజ్ చేయాలని మంత్రి ఒత్తిడి తెచ్చారు….మంత్రి చెప్పిన మాటలు ఈవో వినటం లేదు అని ఈఓ పై బదిలీ వేస్తున్నారు…అని ఆయన ఆరోపించారు.

Related posts

బదిలీ అయిన ట్రాఫిక్ ఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

100 శాతం హాజరు ఉన్న విద్యార్ధులకు బహుమతులు

Satyam NEWS

మనసు మార్చుకోని తాలిబాన్లు: ఆఫ్ఘన్ మహిళలకు నరకం

Satyam NEWS

Leave a Comment