28.7 C
Hyderabad
April 26, 2024 09: 32 AM
Slider సినిమా

సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి జోడీగా A1 ఎక్స్‌ప్రెస్‌

sandeep kishan 13

యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం ఇది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘హిప్ హాప్ త‌మిళ’  సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్ని నేడు యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ‘సింగిల్ కింగులం’ అనే పేరుతో విడుదల అయిన ఈ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు హిప్ హాప్ త‌మిళ’ అందించిన స్వరాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించారు. `A1 ఎక్స్‌ప్రెస్‌` లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నాయకా, నాయికలు కాగా ఇతర ప్రధాన పాత్రలలో రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్; సంగీతం: హిప్ హాప్ త‌మిళ; ఎడిటర్: చోటా.కె.ప్రసాద్; సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,సామ్రాట్; ఆర్ట్: అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా, స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల, నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం, ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను.

Related posts

బస్తీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం

Satyam NEWS

ఉద్యోగం కోల్పోయిన టెక్కీకి సోనూ సూద్ హెల్ప్

Satyam NEWS

మూడు రోజుల పండుగ దివ్యజ్యోతి దీపావళి

Satyam NEWS

Leave a Comment