37.2 C
Hyderabad
April 26, 2024 21: 37 PM
ప్రకాశం

మా ప్రాంతంలోని గ్రామాలన్నీ సమస్యల వలయం

thAKZL095H

ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజానీకానికి  అందనటువంటి పరిస్థితి ఉందని, కేజీ ఉల్లిపాయల కోసం కూలి పనులు మానేసి  రోజంతా క్యూలో  నిల్చుంటే కానీ కిలో ఉల్లిపాయ దొరకటం లేదని ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు ప్రకాశం జిల్లా చీమకుర్తి లో గల స్థానిక  ఏపీ ప్రజా సంక్షేమ సమితి కార్యాలయంలో ప్రజల సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయబడినది.

ప్రధాన డిమాండ్లు: కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రణకు చర్యలు చేపట్టాలి. మూతపడిన అన్న క్యాంటీన్లు  పేద ప్రజల కోసం తక్షణమే తెరవాలి. ట్యాంకర్లు నీటి తో  ప్రజా ధనాన్ని వృధా చేయక శాశ్విత మంచినీటి పధకానికి చర్యలు చేపట్టాలి. వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉన్న ఈ రోజుల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి .ప్రజలు కూరగాయలు  కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో లేదని ఏపీ ప్రజా సంక్షేమ సమితి అభిప్రాయపడింది.

అసలే సంక్షోభం లో నడుస్తున్న గ్రానైట్  ఫ్యాక్టరీలతో గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులుకు  పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికి తోడు పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వలన కార్మికులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్వర్లు అన్నారు.

ఇలాంటి సంక్షోభ సమయంలో గత  ప్రభుత్వం లక్షల ఖర్చు చేసి నిర్మించి ఐదు రూపాయలకే భోజనం పెట్టె అన్న క్యాంటీన్లు మూత పడిపోవటం వలన పేద ప్రజలు ఆటో కార్మికులు,రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ,తోపుడు బండ్లు వారు కడుపు మాడ్చుకుని పరిస్థితి దాపురించింది. 

హోటల్ భోజనం 80 ఖర్చు చేసి తినలేక ఐదు రూపాయల భోజనం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఆక్రందన చుసిన ఏపీ ప్రజా సంక్షేమ సమితి ప్రభుత్వాన్ని తక్షణమే అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరవాలని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంక్షేమ సమితి  రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ ప్రేమల, ఉపాధ్యక్షులు సాపాటి నాగేశ్వర రావు, నాయకులూ  రవి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంజాయి మొక్కలను పెంచితే కఠిన చర్యలు

Satyam NEWS

భార్యపై గొడ్డలితో  దాడి చేసిన భర్త

Satyam NEWS

ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మంత్రి హామీ

Satyam NEWS

Leave a Comment