40.2 C
Hyderabad
April 29, 2024 15: 53 PM
Slider ప్రత్యేకం

కూతురిపై క‌న్న‌తండ్రి లైంగిక దాడి: ప‌దేళ్లు జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా

#deepikaips

పోక్సో  ప్రత్యేక కోర్టు సంచ‌ల‌న‌మైన‌ తీర్పు…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఓ క‌న్న‌తండ్రి చేసిన  పాడు ప‌ని కార‌ణంంగా జిల్లాకే తీర‌న మ‌చ్చ ఏర్ప‌డింది. కంటిరెప్ప‌లా చ‌సుకోవ‌ల‌సిన క‌న్న‌తండ్రే…కామంతో క‌న్నకూతురునే  పాడు చేసారు. అయితే  స‌కాలంతో  ఆ క‌న్న‌బిడ్డే తెగించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం…సంబంధిత స్టేష‌న్ ఎస్ఐ వాసుదేవ్..కేసు కట్ట‌డం…ద‌ర్యాప్తు అధికారి డీఎస్పీ చివార‌ణ‌జ‌రిగి కోర్టులో అభియోగాలు దాఖ‌లు చేయ‌డం…వెంట‌నే ఫోక్సో చ‌ట్టం ప్ర‌కారం. కామంధ తండ్రికి ప‌దేళ్లు జైలుశిక్ష, ఆ పై 20 వేల జరిమానా విధించించి ప్ర‌త్యేక కోర్టు.

వివ‌రాల్లోకి వెళితే. జిల్లాలోని  బొండపల్లి మండలానికి చెందిన  ప‌ద్నాళ్లగేళ్ల‌ కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కన్న తండ్రికి ప‌దేళ్లు జైలు శిక్ష,ఆ పై 20 వేలు జరిమానా విధిస్తూ  పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. 

జిల్లాలోనిబొండపల్లి మండలం, వెదురువాడ పంచాయితీ, పాత పనసలపాడుకి చెందిన ఓ  మైనరు బాలిక మహారాణిపేట హాస్టలులో చదువుతోంది. కరోనా సమయంలో పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికిరాగా, తన కూతురికి పుస్తకాలు తీసుకొనే నిమిత్తం నిందితుడు (తండ్రి) ఎర్రబోయిన సత్యారావు (35 సం.లు) మోపెడ్ పై బయటకు తీసుకొని వెళ్ళి ఒకసారి, మేనత్త ఇంటికి తీసుకొని వెళ్ళతానని మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నిందితుడు మూడోసారి లైంగిక దాడికి యత్నించే క్రమంలో తనతోపాటు పోడు వ్యవసాయ పనులకు రమ్మనమని కుమార్తెను ఒత్తిడి చేయడంతో, తాను రానని నిరాకరించడంతో, ఆమెను కొట్టి, ఇంటి నుండి బయటకు పంపించేసి. డయల్ 100కు ఫోను చేసి, సమాచారం అందించింది.. ఈ విషయమై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొండపల్లి పిఎస్ అప్పటి ఎస్ఐ వాసుదేవరావు  గ‌తేడాది  మే 28 న‌ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు.

ఈ కేసులో బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. ఈ కేసులో త్వరితగతిన ప్రాసిక్యూషన్ పూర్తి చేసేందుకుగాను సమయానుకూలంగా సాక్షులను కోర్టులోహాజరుపర్చి, నిందితుడు శిక్షింపబడే విధంగా మహిళా పిఎస్ డిఎస్పీ టి. త్రినాధ్ చర్యలు చేపట్టారన్నారు.

ఈ కేసులో పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటరు కొండపల్లి సూర్య ప్రకాష్ బాధితురాలి తరుపున వాదనలు వినిపించగా, పోక్సో  ప్రత్యేక కోర్టు జడ్జి షేక్ సికందర్ భాషా నిందితుడికి 10 సంవత్సరాల జైళు శిక్ష మరియు . 20వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు శిక్షింపబడుటలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.  

Related posts

త్వరలో జాతీయ రహదారి పనులకు శ్రీకారం: బిజెపి నేతల హర్షం

Satyam NEWS

పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

దేశం మెచ్చిన నాయకుడు కెసిఆర్: శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment