30.7 C
Hyderabad
April 29, 2024 04: 58 AM
Slider ఖమ్మం

ఉద్యోగాలకోసo 15వేల మంది దరఖాస్తు

#job fair

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే జాబ్‌మేళాకు నిరుద్యోగులనుండి మంచి స్పందన లభిస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీసు స్టేషన్ ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విద్యార్హతలకు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలలోని ప్రధాన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేలాకు మంచి స్పందన రావటం ఆనందంగా వుందన్నారు. ఈ మేలాకు 140 కంపెనీలు రానుండగా, 8150 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటివరకు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. నగరంలోని ఎస్‌బిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఆయా గ్రామాలలోని నిరుద్యోగ యువతీ యువకులను గుర్తించి ఈ మేలాకు హాజరుకావాలని, తద్వారా మంచి ఉద్యోగం సంపాదించించుకోవచ్చని తమ సిబ్బంది అవగాహన కల్పించారని చెప్పారు. హజరైన వారికి పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారని తెలిపారు.

పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వారికి కూడా ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నారని తెలిపారు. ఎంపికైనవారికి రూ. 10 వేల నుంచి రూ.80 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని, సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి అధిక శాలరీ ఆఫర్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఫార్మా, మెడికల్, ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్, సర్వీసెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో టెలీకాలర్స్ నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఇంత భారీస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ఇప్పటివరకు ముందుకు రాలేదని, కావున నిరుద్యోగ యువత తన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.

ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా హజరై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు గణేష్ , భస్వారెడ్డి, రామోజీ రమేష్ , రహెమాన్ , ప్రసన్న కుమార్, వేంకటేశ్వర్లు, వెంకట స్వామి, సిఐ తుమ్మ గోపి పాల్గొన్నారు.

Related posts

విద్యుత్ చార్జీల మోతపై టీడీపీ భత్యాల వర్గీయుల ధర్నా

Satyam NEWS

‘బ్యాక్ డోర్’ గీతం ఆవిష్కరించిన రాజకీయ సంచలనం వైఎస్ షర్మిల

Satyam NEWS

దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి  యువజనులదే

Murali Krishna

Leave a Comment