40.2 C
Hyderabad
April 26, 2024 14: 57 PM
Slider

కరుణామయుడు ఏసుక్రీస్తు జననం పరమ పవిత్రం

#ChristmasCelebrationsInUSA

కరుణామయుడు, పాపాలను హరించే దేవుడుగా ప్రసిద్ధి గాంచిన, దయామయుడైన ఏసుక్రీస్తు డిసెంబర్ 25న రెండువేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యంలోని బెత్లేహామ్లో జోసెఫ్, మేరీ పుణ్య దంపతులకు జన్మించాడు. దేవదూత ఆజ్ఞ ప్రకారం బెత్లేహామ్లోని ఓ పశువుల పాకలో ఏసుక్రీస్తు జన్మించాడు.

అప్పుడు మళ్ళీ దేవదూత కనిపించి దైవానుగ్రహంతో ఓ బాలుడు జన్మించాడని మీ పాపాలకు విముక్తి కల్పిస్తాడని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఏసుక్రీస్తు ప్రపంచానికి మార్గదర్శకుడిగా మారి, కరుణామయుడుగా, దయామయుడుగా పేరొందాడు.

ఏసుక్రీస్తు జన్మదినాన్నే క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. సకల దేశాలలోని క్రైస్తవులు సంతోషం, ఉత్సాహం, భక్తి ప్రపత్తులతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్.

160 దేశాల్లో నెల ముందే నుంచే అంబరాన్నంటిన సంబరాలు

దాదాపుగా 160 దేశాలు క్రిస్మస్ పర్వదినాన్నిఘనంగా నిర్వహిస్తాయి. క్రైస్తవ సోదరులకు ఇది అతి ముఖ్యమైన పర్వదినం. ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఈ పర్వదినాన్ని నిర్వహిస్తారు.

అమెరికా, ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్, అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీ, రోమ్ తదితర ప్రాంతాల్లోనైతే ఒక నెలముందు నుంచే క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటారు. కేక్లు రూపొందించడం, చర్చీల ముస్తాబు, విద్యుద్దీపాలంకరణలు, మ్యూజిక్ ఇలా అన్ని రకాలుగా ఏర్పాట్లు ఒక నెలముందు నుంచే నిర్వహిస్తారు.

ఒక్కో దేశంలో ఒక్కోలా ఈ సంబరాలకు సిద్ధమవుతాయి. పలు దేశాల్లో పెద్ద పెద్ద కేక్లతో ప్రత్యేకతగా నిర్వహిస్తే, పలు దేశాల్లో చర్చీలను విద్యుద్దీపాలంకరణతో జిగేల్మనేలా మెరిపిస్తారు. సంగీతాల ద్వారా ఏసుక్రీస్తు సూక్తులను ప్రచారం చేస్తూ కొందరు పర్వదినాన్నినిర్వహిస్తే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లేహామ్ (రోమ్) చర్చిలో ఈ వేడుకలు అంబరాన్నంటుతాయి.

Related posts

వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిచిన కాంగ్రెస్

Satyam NEWS

మహిళా ఎస్సైని ఏడిపించిన ముగ్గురు విలేకరులపై కేసు

Bhavani

కాంగ్రెస్ పార్టీ నుండి టీఆరెస్ లోకి భారీ చేరికలు

Satyam NEWS

Leave a Comment