37.2 C
Hyderabad
April 26, 2024 20: 48 PM
కవి ప్రపంచం

రథసారథి

#Mulugu Laxmi Mythili Nellore

అతడు దార్శనికుడు

ఓకే ఒక్క తెలుగు వాడు

స్వతంత్ర భారత దేశచరిత్రలో

ప్రముఖ రాజనీతిజ్ఞుడు

దక్షిణాది రాష్ట్రాల నుంచి

ఎన్నికైన తొలి భారత ప్రధాని

కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థను

తిరిగి నిలబెట్టిన అపర చాణక్యుడు

పదిహేడు భాషల్లో ధారాళమైన

పటిమను చూపిన బహుభాషా కోవిదుడు

అతని దూరదృష్టి, వాక్చాతుర్యం తో

పదవికే వన్నె తెచ్చిన అపర మేధావి

జాతీయ విద్యా విధానం ఆపరేషన్

బ్లాక్ బోర్డు పథకాల రూపశిల్పి

కార్యాచరణ ప్రణాళికా సంస్కరణల్లో

గొప్ప సంస్కారశాలియైన రథసారథి

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేసిన

కార్యదక్షత లో దేశభక్తుడు

పీవీ అంటేనే పరిపాలనా దక్షుడు

ముఖ్యమంత్రి గా భూసంస్కరణల ను

చేపట్టిన మహనీయుడు..

ప్రజా సంక్షేమమే పరమావధి గా

సామాజిక మర్మమెరిగిన జ్ఞాని

వేయి పడగల్ని హిందీ లో

అనువదించిన  రచనా ప్రవీణుడు

మరెన్నో రచనలను అందించిన

బహుముఖ ప్రజ్ఞాశాలి

అతని సాహితీ కృషికి నిదర్శనం

సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రజాసేవలో అలుపెరుగని సేవ చేసి

జ్ఞాన్ భూమిలో శాశ్వత నిద్ర లో

సేదతీరుతున్న  రాజర్షి

పీవీ నరసింహారావు గారి కి

అక్షర నివాళుల అర్పణలు!!

ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్:9440088482

Related posts

భారత అనర్ఘ రత్నం

Satyam NEWS

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS

‘సింహవాహిని దర్శనం-సకల పాప సంహారం’

Satyam NEWS

Leave a Comment