32.7 C
Hyderabad
April 26, 2024 23: 22 PM
Slider కవి ప్రపంచం

నాన్న ఓ ప్రేమసాగరం

#Sandhya Sutrave New

మాతృదేవోభవ, మాతృభూమి

అని గొప్పగా చెప్పుకొనే మనదేశంలో

నాన్న శబ్దానికి సెకండ్ ప్లేసే,

నిజానికి నాన్న కుటుంబ వృక్షానికి

ఆయువుపట్టు,ఊతం,పెద్దదిక్కు,

తనభుజస్కంధాలపై కుటుంబ

భారాన్ని మోసే బాహుబలి

తండ్రిగా ప్రేమతోసంతానాన్ని,

క్రమశిక్షణతో పెంచుతూ

తన శక్తి,యుక్తి, సంపదనంతా

తన పిల్లలకై వెచ్చించే నిస్వార్థి

పిల్లల్ని అత్యున్నత స్థానంలో

నిలుపుటలో నిరంతర కార్యశీలి,

నాన్న ఓర్పు,నేర్పు, పిల్లల

ప్రగతికి సోపానాలు

వారి వృధ్ధిలో తన మూలాలు

వెతుక్కొని, గర్వపడే అల్పసంతోషి

కృషి,నీతి,నిజాయితి,శ్రమైక్యజీవన

సౌందర్యానికి మారురూపు నాన్న

కోపించిన ,కళ్ళెర్రచేసిన అది పిల్లల

భవితకు బంగరు బాటలేయుటకే,

ధైర్యానికి,సాహసానికి మారుపేరు నాన్న

ఎన్నో ఒత్తిడిలున్నా,ప్రశాంతచిత్తంతో

ఉండే , ప్రత్యక్ష ప్రేమసాగరం

పిల్లలను భుజాలపై ఎత్తుకొని

తన వేలినందించి,తప్పటడుగులను

సరిచేసి ముందుకు నడిపే దిక్సూచి

పిల్లల వయసుకు తగ్గ అవసరాలు

తీర్చుతూ, ఆనందపడే అంతర్ముఖి,

గంభీరంగా,కఠినంగా,కనిపించిన

నాన్న మనసు వెన్న,

నాన్నే పిల్లలకు హీరో,అనితరసాధ్యుడు

ఏ పనినైనా క్షణంలో,

చక్కబెట్టే సమర్థుడు,

అతనొక  సాంకేతిక నిపుణుడు,

అలాంటి నాన్నకు పుట్టినందుకు,

గర్విస్తూ,ఇవే నా అక్షర నీరాజనాలు

సంధ్య సుత్రావె, సుల్తాన్షాహి, హైద్రాబాద్

Related posts

స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

కారణం చెప్పి.. రామన్న కంటతడి

Satyam NEWS

Leave a Comment