29.7 C
Hyderabad
May 2, 2024 04: 50 AM
Slider గుంటూరు

A Big question: పేదలకు ఇళ్లు పొందే అర్హత లేదా?

#TDP Narasaraopet

అధికార పార్టీ ద్వారా ప్రభావితం చేసిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని అర్హత గల పేదలకు ఇవ్వడం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. రోడ్డు పక్కన నివసించే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన నిరసన కార్యక్రమంలో అరవింద బాబు మాట్లాడుతూ పట్టణంలో 8260 మంది లబ్ధిదారులకు గృహలు, ఒక సెంట్ ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో 1504 గృహాలు గత ప్రభుత్వం హయాంలో టిట్ కో సంస్థ వారు నిర్మించి కేటాయించారు.

ఐతే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రూ 50,000లు చెలించిన లబ్ధిదారులకు ఇంకా ఎలాంటి రుణాలు చెలించే పనిలేకుండా టిట్ కో సంస్థ గృహాలు కేటాయించింది. ఐతే  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా లబ్ధిదారులకు ఉచితంగా గృహాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి  మాట తప్పి మడమ తిప్పారు.

300 మంది లబ్ధిదారులను అనర్హులుగా లిస్ట్ లో నుండి పేర్లు తొలగించారు. ఇప్పుడు గతంలో చెలించిన రూ.50 వేలు కాకుండా మరలా రూ. 12,500లు చెలించి రూ 3.60 లక్షలు ఏక మొత్తంగా  ఒకేసారి కానీ, లేదా 18 నెలలలో కానీ చెలించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో లబ్ధిదారులలో నిరాశ, ఆందోళన నెలకొన్నాయి.

కాగా మిగిలిన 6756 మంది లబ్ధిదారులలో టిట్ కో సంస్థ వద్ద ఉన్న 14 ఎకరాలలో లింగంగుట్ల వద్ద ఉన్న మున్సిపల్ స్థలంలో, మండలంలోని ఉప్పలపాడు వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. ఐతే స్థలం కావాలంటే 15000 కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. పట్టణంలో వైసిపి నాయకులు, వాలంటీర్ ద్వారా స్థలాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు.

నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న కేసనపల్లి ,నిన్న పాలపాడు, నేడు శ్రీనివాస గిరిజన కాలనీ. మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఎలాంటి అన్యాయం జరగదు.

అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తాము. హైకోర్టు డీడీలు కట్టిన లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో వల్లెపు నాగేశ్వరరావు, శేఖర్, కొల్లి బ్రహ్మయ్య, రాయప్ప, యాడ్స్ వలి, బంగారం, బాషా, బడే బాబు, జరీనా, సైదమ్మ, మారుతి, నాగూర్, గడ్డం కరిముల్లా, సైదా వాలి,కావూరి శ్రీను,నరసింహ రావు వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related posts

వేదశిఖర సమానుడి మహాభినిష్క్రమణం

Satyam NEWS

కొట్లాడితే కరిగిపోవడానికి గత పాలకుల మాదిరి కాదు

Satyam NEWS

భారత్ లో ఎమర్జన్సీ విధించి నేటికి 46 ఏళ్ళు…!

Satyam NEWS

Leave a Comment