38.2 C
Hyderabad
April 28, 2024 21: 39 PM
Slider విశాఖపట్నం

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

#Police

ఉద్యోగాలు అవసరమైన వారిని లక్ష్యంగా చేసుకొని వాట్సప్ ద్వారా పని కల్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి అనధికారిక లింకుల ద్వారా నగదు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను విశాఖ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా చేతిలో అక్టోబర్ 13న విశాఖకు చెందిన ఒక వ్యక్తి ఈ విధంగా 12,83,670 రూపాయలు మోసపోయాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బీహార్ కు చెందిన సుమన్ సాహా రాజస్థాన్ కు చెందిన, శుభం సింగ్, దీపక్ సంగ్రా, ప్రణవి చౌహన్, మిట్టు లా జట్ వికాస్ భాసిత లను అరెస్ట్ చేశారు.

మరోక ముగ్గురు నిందితులు ప్రదీప్ చౌదరి, రాజినిష్ గుజ్జారా, మాజిద్ లను అరెస్టు చేయాల్సి ఉంది. నిరుద్యోగులకు, గృహిణులకు ఇంటి వద్దనే ఉంటూ మెబైల్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని ఆశ కల్పించి తద్వారా చిన్న చిన్న టాస్కులు వారికి ఇచ్చి వాటి ద్వారా డబ్బు వస్తుంది నమ్మించి అనంతరం బాధితుల వద్ద సేకరించిన సమాచారంతో వారి ఖాతాలో డబ్బులు లింకులు పంపి వాటిని క్లిక్ చేయడం ద్వారా దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

Related posts

లాండ్రీ, కటింగ్ షాపులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కరువైంది

Satyam NEWS

కరోనా చికిత్సలో మంచి ఫలితాలు ఇచ్చేది ఏదో తెలుసా?

Satyam NEWS

Leave a Comment