ప్రభుత్వం మారగానే ఊళ్లకు, వీధులకు ఇతర ప్రజాసంబంధమైన భవనాలకు పేర్లు మార్చడం ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అనే కన్నాపిచ్చి అనడం కరెక్టేమో. కృష్ణా పత్రిక ఫౌండర్ ముట్నూరి కృష్ణారావు పేరున మచిలీపట్నం లో ఉన్న టౌన్ హాల్ పేరు ను విక్టోరియా మెమోరియల్ అండ్ పబ్లిక్ లైబ్రరీ గా మార్చారు. ముట్నూరి కృష్ణారావు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య లాంటి ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతంలో ఉండేవారు. అయితే వారందరిని కాదని ఓ పరదేశీయురాలు పేరు పెట్టడం ఏమిటి? కృష్ణాపత్రిక స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో నడచిన పత్రిక. అలాంటి పత్రిక స్ధాపించిన ముట్నూరి కృష్ణారావు బందరు వారు కావడం మన అదృష్టం. కొన్ని దశాబ్దాలుగా ఆయన పేరు తో ఉన్న టౌన్ హాలు పేరును మార్చే అధికారం మీకెవరిచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు మచిలీపట్నం కు చెందిన న్యాయవాది బూరగడ్డ అశోక్ కుమార్. మన తెలుగు వాడు, మన భారతీయుని పేరు మార్చి పర దేశీయుల పేరు మార్చే అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈ కుట్రకు బాధ్యులెవరు? ఇలా పేర్లు మార్చటం సిగ్గుచేటు అని ఆయన అంటున్నారు.
previous post