కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో త్రాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఇదే అదునుగా భావించి కొందరు నిర్వాహకులు తమ నీటి దందాకు తెర ఎత్తారు. గతంలో రెండు నీటి ప్లాంట్లు ఉండేవి ఇప్పుడు ఏకంగా ఎనిమిది వరకు నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. వీటికి కనీస ఐఎస్ఐ మార్కు అనుమతి కూడా లేదు .దానికి తోడు గ్రామ పంచాయతీ గానీ ప్రభుత్వ అధికారిక అనుమతులు కూడా లేకుండానే వీరు తమ నీటి దందాను కొనసాగిస్తున్నారంటే మండల ప్రజల నీటి సమస్య ఎంత ఉందో స్పష్టమవుతున్నది. ఇష్టారీతిన కెమికల్ను కలుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురంటున్నారు .ఈ నీరు తాగి ఇప్పటికే పలువురు మోకాళ్ల నొప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నారని మండల వాసులు అంటున్నారు .ఈ విషయంపై ఉపతహసీల్దార్ కు అనుమతులకు విషయంపై ఆరా తీయగా తమ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదన్నారు .గ్రామ పంచాయతీలోనూ వివరణ కోరగా తమ వద్దకు ఎటువంటి అనుమతులు కొరకు దరఖాస్తులు రాలేదని తాము ఎవరికీ అనుమతినివ్వలేదు న్నారు .ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న నీటి ప్లాంట్లపై ప్రత్యేకంగా దాడులు చేస్తేనే గానీ వీరి వ్యవహారాలు బయటపడవని పలువురంటున్నారు. దీనిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
previous post