27.7 C
Hyderabad
April 30, 2024 09: 42 AM
Slider ముఖ్యంశాలు

మావోయిస్టు రహిత తెలంగాణే పోలీసుల లక్ష్యం

#dgp

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే రాష్ట్ర పోలీసుల ప్రధాన లక్ష్యం అని  డిజిపి ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్న డీజీపీని జిల్లా ఎస్పీ డా.వినీత్ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించిన డిజిపి నూతనంగా తయారుచేసిన క్రీడా మైదానం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డీజీపీతో పాటు అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ శ్రీనివాస రెడ్డి, నార్త్ జోన్ అడిషనల్ డిజిపి నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా, ఎస్ఐబి ఆపరేషన్స్ చీఫ్ ప్రభాకర్ రావు లు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో డిజిపి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాల పోలీసు అధికారుల పనితీరు ప్రశంసనీయమని అన్నారు. తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పనిచేసే పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అక్కడ ప్రజల సహకారంతో మావోయిస్టు వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని తెలియజేసారు.

సిఆర్పిఎఫ్ పోలీసులతో సమన్వయం పాటిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల కదలికలపై సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తెలంగాణలోకి నిషేధిత మావోయిస్టులు ప్రవేశించకుండా అరికట్టడంలో ఈ రెండు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది సఫలీకృతం అవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందే విధంగా, విద్య వైద్యం రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా పోలీసులు ముందుకు వెళుతున్నారని తెలిపారు. నేర రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా నేరాలను అదుపు చేయడం నేరస్తులను త్వరితగతిన పట్టుకోవడం పోలీసులకు సులభంగా మారిందని అన్నారు.

నేర రహిత సమాజాన్ని నిర్మించి రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి అత్యధిక పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను సాధించి మన భావితరాలకు ఉద్యోగావకాశాలను, ఆదాయ వనరులు కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. అనంతరం ఇరు జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ పోలీసులు సాధిస్తున్న విజయాలతో దేశంలోనే నెంబర్  వన్ గా నిలిచామని అన్నారు.

Related posts

రామన్నపేట, నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంపు

Satyam NEWS

ఆర్టీసీ కార్మిక సోదరులారా సమ్మె విరమించండి

Satyam NEWS

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

Satyam NEWS

Leave a Comment