పండుగల కోసం సొంత ఊర్లకు రావాలనుకుంటున్నవారికి ఆర్టీసీ సమ్మె ఒక అడ్డంకిగా మారిందని అందువల్ల తక్షణమే సమ్మె విరమించాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను కోరారు. గల్ఫ్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలోని స్వగ్రామాలకు వెళ్లలేకపోతున్నారని ఆయన అన్నారు. సంబురాలు జరుపుకోవడానికి వస్తున్న వందలాది మంది గల్ఫ్ ప్రవాసులు పడుతున్న ఇబ్బందులను గమనించి తాను ఆర్టీసీ కార్మికులకు సమ్మె విరమించాలనే వినతిని చేస్తున్నట్లు బసంత్ రెడ్డి తెలిపారు. డిమాండ్లు సాధించుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవసరమైనపుడు సేవలు అందించడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గుర్తుంచుకోవాలని బసంత్ రెడ్డి కోరారు. ఏడాదికి ఒక సారి వచ్చే పండుగలకు ఇలా ఆర్టీసీ కార్మికులు అడ్డుపడితే ప్రజలకు వారిపై సానుభూతి లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు
previous post