40.2 C
Hyderabad
April 28, 2024 15: 05 PM
Slider మహబూబ్ నగర్

ఇవి మిల్లులు కాదు రేషన్ బియ్యం తినేసే పందికొక్కులు

#rice mill

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో పేదోడి పొట్ట కొట్టడానికి కోట్లు కొల్లగొట్టడానికి మరో పది కి పైగానే రైస్ మిల్లులు నూతనంగా పురుడు పోసుకోనున్నాయి. వీటితో పాటు మూడు పార్ బాయిల్డ్ మిల్లులు నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ మిల్లులకు క్రేజ్ పెరగడానికి కారణం పెట్టుబడి లేని వ్యాపారం ప్రభుత్వం ఇచ్చే వడ్లను బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు.

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లాభసాటిగా ఉండటం ఒక కారణమైతే, ప్రభుత్వం ఇచ్చిన వడ్లకు తిరిగి ప్రభుత్వానికి బియ్యం రూపేణా రవాణా చేయాల్సి ఉండగా రేషన్ షాప్ నుంచి లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల నుండి పదో, పరకో ఇచ్చి బియ్యాన్ని కొనుగోలు చేయగా మరోవైపు రేషన్ షాప్ యజమానులు సమయపాలన పాటించకుండా, కొందరికి బియ్యం ఇవ్వకుండా అటువంటి రేషన్ షాప్ యజమానుల నుండి కొనుగోలు చేసి తిరిగి లెవీ రూపకంగా ప్రభుత్వానికి రీసైక్లింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం మూతపడిన మిల్లులు పల్లెటూర్లలో రేకుల షెడ్లతో పాటు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే ఇప్పటికే పది వరకు నూతన మిల్లులు ప్రారంభించారు. సివిల్ సప్లై, రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, పోలీస్, టాస్క్ ఫోర్స్ ఆరంఛల అధికారుల భద్రత లో కూడా లబ్ధిదారుని కి బియ్యాన్ని అందకుండా పేదోని పొట్ట కొడుతున్నారు.

ఎంతోమంది ఎన్నో సార్లు పట్టుబడిన మిల్లు యజమానులపై నేటికీ ఒక్కరిపై కూడా పిడియాక్ట్ నమోదు కాలేదంటే అతిశయోక్తి కాదు.సామాన్యుడికి చేరేవరకు ఇవ్వాల్సిన ఆరంచెల భద్రత మిల్లు యజమానులకు ఇవ్వడంతో కొత్త కొత్త మిల్లులు పుట్టుకొస్తున్నాయి.

ఏ వ్యాపారంలో లేని లాభం రెండే రెండు సంవత్సరాలలో కోట్లు సంపాదించుకోవచ్చుని, ఈ వ్యాపారంలో అధికారులే రక్షణ కల్పించడంతో ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోడనే సామెతను నిజం చేస్తున్నాయి.

పీడీఎస్ బియ్యం పురుగు పట్టి, ముక్క పట్టి, 40 శాతం నూకలు తినడానికి వీలు లేకుండా ఉన్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాం అధికారులు పాసింగ్ చేసి మిల్లు యజమానులకుసహకరించడం, అదే విధంగా కొందరు రేషన్ షాపుల యజమానులు లబ్ధిదారులకు అందాల్సిన సన్నబియ్యాన్ని వారి సొంత రైస్ మిల్లుకు తరలించు కొని వారి దగ్గర పూర్వం ఉన్న దొడ్డు రకం రేషన్ బియ్యాన్ని పంచుతున్నారు.

రాత్రి 10 నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు దేవరకొండ ,మల్లేపల్లి ,చారగొండ, అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా నుండి సైతం రేషన్ బియ్యాన్ని కల్వకుర్తి పట్టణ పరిధిలోని మిల్లు యజమానులు కొందరిని ఏజెంట్లు గా నియమించుకొని కొనుగోలు చేస్తున్నారు.పట్టణానికి ఇరు వైపులా ,చిన్నచిన్న పల్లెటూర్లను, ఎంచుకొని రైస్ మిల్లులను లీజు తీసుకొని కొన్ని రోజులు వ్యాపారాన్ని సాగించి పొలాలు కొనుక్కొని  సొంతంగా,నూతన మిల్లులను నిర్మించుకొని ఈ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల మండలాల్లో రేషన్ బియ్యం వ్యాపారం చేయడానికి అధికారులు సహకరించకపోవడంతో

ఇతర జిల్లాల నుండి సైతం  కల్వకుర్తి పట్టణానికి పిడిఎస్ బియ్యం అడ్డూ అదుపు లేకుండా యదేచ్ఛగా వస్తున్నాయి. కల్వకుర్తి పట్టణంలో ఉన్నత అధికారుల పర్యవేక్షణలో కూడా పట్టుబడిన మిల్లు యజమానులపై తూతూమంత్రంగా వ్యవహరిస్తూ   పట్టుబడినా ఇవి రేషన్ బియ్యం కాదని వారే తేల్చి చెప్తున్నారు. ఇంత మంచి వ్యాపారం ఏ అడ్డు లేకుండా కోట్లు సంపాదించడం తో వచ్చే ఏడాదిలో ఇంకెన్ని రైస్ మిల్లుల శంకుస్థాపన జరుగుతుందో వేచి చూడాల్సిందే.

లబ్ధిదారునికి సత్యం న్యూస్ సూచన

లబ్ధిదారుడు రేషన్ షాప్ కి వెళ్ళినప్పుడు నిండు బియ్యం సంచికి ఏ మిల్లునుండి వచ్చాయో పూర్తి సమాచారం ఉన్న లేబుల్ ఉంటుంది. లబ్ధిదారుడు తినలేని బియ్యం ఇస్తున్నప్పుడు పట్టణ తాసిల్దార్ కు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించవచ్చు.

పోల శ్రీధర్ సత్య న్యూస్ రిపోర్టర్ కల్వకుర్తి

Related posts

వ్యాక్సిన్ చేస్తున్న మనకే వ్యాక్సిన్ లేకుండా పోతున్నది

Satyam NEWS

అమ్మ పాట తిరుపతి కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

కులవివాదంలో చిక్కుకున్న ఏపి హోం మంత్రి

Satyam NEWS

Leave a Comment