31.7 C
Hyderabad
May 2, 2024 11: 00 AM
Slider సినిమా

కరోనా యోధులకు ‘పాటా’భివందనం

#Puja Hegde

కరోనాను కట్టడి చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ‘పాటాభివందనం’ అంటున్నాడు లీడింగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్. పలువురు ప్రముఖ హీరోయిన్లకు పర్సనల్ మేనేజర్ గానూ వ్యవహరిస్తూ పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన నవీన్ కుమార్.. కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులకు, వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు, స్వచ్చంద సంస్థలకు సెల్యూట్ చేస్తూ ఒక కృతజ్ఞతాగీతం రూపొందించారు.

‘ఎంతో ఆపదకాలం… చుట్టూ మారిన లోకం- మనతో మనకే దూరం.. ఎప్పుడూ చూడని వైనం’ అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీహర్ష ఈమని రాయగా.. సాకేత్ కొమండూరి స్వర సారధ్యంలో సోనీ కొమండూరి-శ్రీనాధ్ కొమండూరి-సాకేత్ కొమండూరి ఆలపించారు. ‘మనల్ని కరోనా కోరల నుంచి కాపాడుతున్న ఈ ‘నడిచే దైవాల కోసం’ నా వంతుగా ఏదైనా చేయాలనిపించి ఈ గీతాన్ని రూపొందించాను’ అంటున్నాడు యంగ్ అండ్ డైనమిక్ క్యాస్టింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్!!

Related posts

బీసీ గురుకుల పాఠశాలలో ప్రమాదం: ఒక చిన్నారి మృతి

Satyam NEWS

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS

జూలై 14 నుండి ఎంసెట్

Sub Editor 2

Leave a Comment