28.7 C
Hyderabad
April 26, 2024 08: 11 AM
Slider పశ్చిమగోదావరి

ఆదరణ పని ముట్లు…. దాచారు… అమ్ముకున్నారు

#aadarana

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో 2018 లో మంజూరైన ఆదరణ పనిముట్లలో కొన్ని విలువైన పనిముట్లు ఓ ఉద్యోగి దొడ్డిదారిన అమ్ముకుని సొమ్ముచేసుకున్నాడనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఆదరణ పనిముట్ల కోసం మూడేళ్ళుగా ఎదురు చూస్తున్న లబ్ది దారులకు తాము బాంక్ లలో  లబ్ది దారుని వాటాగా కట్టిన 10శాతం  డి డి ల రూపంలో కట్టిన సొమ్ములు కు కూడా సమాధానం చెప్పడం లేదని విశ్వసనీయ సమాచారం.

అసలు పెదవేగి మండలంలో ఆదరణ లబ్ది దారులు ఎంతమంది, ఎంతమంది పనిముట్ల కోసం డి డి లు కట్టారు, మండలానికి ఎన్ని పనిముట్లు వచ్చాయి, ఎంత మందికి పంపిణీ చేశారో వాటిలో కొన్ని విలువైన వాషింగ్ మెషిన్ లు చిత్రీక మెషిన్ లు, సెలూన్ ఛైర్స్ వంటివి దొడ్డిదారిలో అమ్ముడు పోయాయి అనే వివరాలు తెలియని పరిస్థితి. కొన్ని కుట్టు మెషిన్ లు, పాల కాన్ లు ఇంకా మండల పరిషత్ కార్యాలయం లోను దెందులూరు మార్కెట్ కమిటీ షెడ్ లలో తుప్పు పత్తిపోతున్నాయని పనిముట్లు కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ది దారులు ఆరోపిస్తున్నారు.

వివరాలలోకేళితే మండలంలో మొత్తము 2965 పనిముట్లు వచ్చాయి. వాటిలో2416 మంది లబ్ది దారులకు పనిముట్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. మిగిలిన 545 పనిముట్లు జాడ తెలియడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి .వీటిలో వాషింగ్ మెషిన్ లు, గ్రాస్ కట్టర్స్, కుట్టు మిషన్ లు, సెలూన్ ఛైర్స్, చిత్రీక మెషిన్ లు  గల్లంతయ్యాయని చెప్పుకుంటున్నారు.

కొంత మంది లబ్ది దారులు తమకు రావలసిన పనిముట్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆ అధికారిని ప్రశ్నిస్తే మీ డి డి లు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారని తెలిసింది. దీనిపై ఆదరణ పనిముట్ల పంపిణీ ఇంచార్జ్ పెడవేగి మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ రాంబాబుని ఇటీవల వివరణ కోరగా పనిముట్లు లబ్ది దారులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

దొడ్డిదారిలో పనిముట్లు అమ్ముడు పోలేదని కాకపోతే కొన్ని పనిముట్లు మండల పరిషత్ కార్యాలయంలో ఒక గది లోను, మరికొన్ని పనిముట్లు దెందులూరు మార్కెట్ కమిటీ షెడ్ లో భద్ర పరచాల్సి వచ్చిందని చెప్పారు.

Related posts

తప్పెవరిది.. ఆర్టీసీ బస్సు దా..? సిబ్బంది దా…?

Satyam NEWS

బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

Satyam NEWS

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం

Bhavani

Leave a Comment