33.7 C
Hyderabad
April 29, 2024 02: 35 AM
Slider నల్గొండ

ఆధార్ కార్డు లేదని బడిలో చేర్చుకోక పోవటం విచారకరం

#lelavati

విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి

ఆధార్ లేదని బడిలో చేర్చుకోకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులు నిరాకరించి,నిర్లక్ష్యం వహిస్తున్నారని ‘విన్నపం ఒక పోరాటం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. సార్వత్రిక నమోదు ప్రకారం 100 శాతం బడి ఈడు పిల్లలను బడిలో చేర్చుకోవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్నిచోట్ల కొద్దిమంది ఉపాధ్యాయులు బడి ఈడు పిల్లలను బడిలో చేర్చుకోకుండా ఆధార్ కార్డు లేదని ఇతర చిన్న చిన్న కారణాలతో  విద్యార్థులను బడిలో చేర్చుకోకుండా పంపించేస్తున్నారని లీలావతి అన్నారు.

ఇలాంటి కారణాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించలేక చివరికి చిన్నారులను ఇంటి పనికో,బయట పనికో, చివరికి అడుక్కోటానికి కూడా పంపుతున్నారని,పిల్లల భవిష్యత్తుని వెట్టి చాకిరికి అంకితం చేస్తున్నారని లీలావతి తన ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి కారణం ఒకరకంగా ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధ్యాయులు ఆలోచన ప్రవర్తన వల్ల చిన్నారుల బాల్యం విద్యకు దూరమైపోతుందని,సంచార జాతులుగా తిరిగే కుటుంబాలు,గిరిజన తెగ పిల్లలు  పరిస్థితి మరి అధ్వానంగా తయారౌతుందని,కొద్ది మంది ఉపాధ్యాయుల పనితీరు వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమౌతుందని అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం గోపాలపురం గ్రామంలో ఆధార్ కార్డు లేదనే కారణంతో గత మూడు సంవత్సరాలుగా బడిలో చేర్చుకోలేదని,ఈ విద్యా సంవత్సరం ‘విన్నపం ఒక పోరాటం’ స్వచ్ఛంద సంస్థ జడ్పీటిసి కొప్పుల సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి గోపాలపురం గ్రామ అంగన్వాడీ  ఉపాధ్యాయునితో మాట్లాడి విద్యార్థినిని బడిలో చేర్చామని అన్నారు.పనితీరు ఇలా ఉంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పరిస్థితి  అగమ్య గోచరంగా మారుతుందని,ఇట్టి విషయం తమ సంస్థ దృష్టికి రావటంతో

తమ వంతుగా న్యాయం చేయగలిగామని, విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ తరఫున పాపకు డ్రెస్సు,బ్యాగ్,స్లేట్,పెన్సిల్, చెప్పులు కొని ఇవ్వడం జరిగిందని అన్నారు.

తమ తమ ఏరియాలో ఉన్న ఇలాంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ముందుకు రావాలని చీకూరి లీలావతి ఈ సందర్భంగా కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

బోర్డర్ టూరిజంతో మరో అడుగు ముందుకేసిన గుజరాత్

Satyam NEWS

యాదగిరి గుట్టలో విషాదం: భవనం నేల కూలి నలుగురి మృతి

Satyam NEWS

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బిజెపి…

Satyam NEWS

Leave a Comment