38.2 C
Hyderabad
April 29, 2024 19: 21 PM
Slider నల్గొండ

ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనం ప్రారంభం

#Aalana Polietive care

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రాంతీయ వైద్యశాలలో ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనాన్ని  హుజుర్ నగర్ శాసస సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సైదిరెడ్డి మాటాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కదలలేని స్థితిలో మంచం పట్టిన రోగులకు  తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న” ఆలన ” ప్యాలియేటివ్  హోమ్ కేర్ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖపాలనాధికారి, NCD ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరాజు మాటాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆలన వాహనంలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్స్ ఉండి ప్రతిరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని  లింగగిరి,  గరిడేపల్లి, కల్మలచెరువు, నేరేడుచర్ల, పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని దీర్ఘకాలిక రోగులకు సేవ చేస్తారని తెలిపారు.

క్యాన్సర్, కిడ్నీ, పక్షవాతంతో మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యం అందించడంతో పాటు ఉచిత మందులు, వైద్య పరీక్షలు, ఉచిత ఫిజియోథెరపీ సేవలు స్థానిక ఆశ  కార్యకర్తల సహకారంతో అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ Dr.ప్రవీణ్ కుమార్, హుజూర్ నగర్ మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్ గౌడ్,హుజుర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, TRS పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, TRS నాయకులు గెల్లి రవి,  ఇందిరాల రామకృష్ణ, బందెల రాములు, సోమగాని ప్రదీప్, మల్లారెడ్డి, స్టాఫ్ నర్స్ మరియమ్మ, డ్రైవర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇది కూల్చివేతల ప్రభుత్వం…ప్రజావేదిక విధ్వంసానికి మూడేళ్లు

Satyam NEWS

ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత జాతరకు అంతా సిద్ధం

Satyam NEWS

మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం

Satyam NEWS

Leave a Comment