30.7 C
Hyderabad
April 29, 2024 06: 41 AM
Slider మహబూబ్ నగర్

అక్రమ అరెస్టులను ఖండిస్తూ తాహశీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా

Aasha workers

ఆశా కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చేసిందని, స్త్రీలు అని కూడా చూడకుండా పాశవికంగా అరెస్టు చేయడం సరికాదని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ శివ వర్మ అన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ కొల్లాపూర్ తాహశీల్దార్ ఆఫీస్ ముందు నేడు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా శివ వర్మ మాట్లాడుతూ ఆషా వర్కర్స్ 12వ తేదీన నిర్వహించిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్న సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కెసిఆర్ ప్రభుత్వం నిరంకుశంగా అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని ఆయన అన్నారు.

దౌర్జన్యంగా  ఆశ ల ఉద్యమం ఆపలేరని ఆయన చెప్పారు. ఆశలకి   బకాయి వేతనాలు ఇవ్వాలని, ఆశలకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా  కార్యకర్తలను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమం లో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దశరథం కె వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కురుమయ్య, ఆశా కార్యకర్తలు,వాణి, గౌరవమ్మ, శివ లీల, చెన్నమ్మ, వకుళాదేవి, నిర్మల,తదితరులు పాల్గొన్నారు.

Related posts

పురంద‌ర దాసు కీర్త‌న‌ల‌తో సంగీత పితామ‌హుల‌కు సంస్మ‌ర‌ణార్చ‌న‌

Satyam NEWS

మునిసిపల్ కార్మికులకు గంగమ్మ జాతర బహుమానం ఇవ్వాలి

Bhavani

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదు

Satyam NEWS

Leave a Comment