28.7 C
Hyderabad
April 28, 2024 03: 22 AM
Slider ఆంధ్రప్రదేశ్

కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారు?

AB Venkateswerarao

సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ (క్యాట్) లో వేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం తరపున క్యాట్ విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కేసు కోసం నియమించిన సీనియర్ కౌన్సిల్ దేశాయి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.

ప్రకాష్ రెడ్డికి ఈ కేసులో హైకోర్టులో స్పెషల్ కౌన్సిల్ పి గోవిందరెడ్డి, క్యాట్ హైదరాబాద్ బెంచ్ ప్రభుత్వ న్యాయవాది ఎం బాల్ రాజ్ సహకరిస్తారు. డీజీ స్థాయి అధికారిని  సస్పెండ్ చేస్తే  హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా అని ఈ సందర్భంగా క్యాట్ ప్రశ్నించింది. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు అని కూడా ప్రశ్నించింది.

అదే విధంగా ఈ ఐపీఎస్ అధికారికి మే 31  2019  నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. వీటన్నింటికి సమాధానాలు చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం వారం రోజుల సమయం అడిగింది. దాంతో కేసు విచారణ ఈ  నెల 24  కి వాయిదా వేశారు.

Related posts

చిలకలూరిపేటలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక

Satyam NEWS

అనుమానం మంటల్లో కాలిపోయిన కుటుంబం

Satyam NEWS

జస్టిస్ పై జగన్ ఆరోపణల విచారణకు సుప్రీం రెడీ

Satyam NEWS

Leave a Comment