31.7 C
Hyderabad
May 2, 2024 10: 19 AM
Slider శ్రీకాకుళం

విద్యాసంవ‌త్స‌రాన్నికాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

ABVP

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి డే అండ్ నైట్ వరకు ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బూరె నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంద‌న్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యాసంవత్సరం కోల్పోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే విద్యా సంవత్సరాన్నికాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం చేయకపోవడం చేతగానితనం అని ఏబీవీపీ దుయ్య‌బ‌ట్టింది.

ప్రభుత్వం నియమించిన ఫీజు నియంత్రణ కమిషన్ ఇంతవరకూ ఫీజులు ఖరారు చేయకపోవడం శోచనీయమంది. ఫీజు నియంత్రణ కమిషన్ వల్ల విద్యార్థులకు ప్రస్తుతం ఒరిగిందేమీ లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు చేసి అడ్మిషన్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ ఏబీవీపీ చేసింది. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

డిమాండ్స్ లో ప్ర‌ధాన‌మైన‌వి

  1. మొదటి సంవత్సరం డిగ్రీ, ఇంజనీరింగ్ ఆన్లైన్ అడ్మిషన్స్ పై స్పష్టత ఇవ్వాలి.
  2. పెండింగ్లో ఉన్నటువంటి (ఎంసెట్, లాసెట్, ఐసెట్ )కోర్సుల కౌన్సెలింగ్ ను త్వరితగతిన చేపట్టాలి.
  3. పెండింగ్లో ఉన్న ఫీజురియంబర్స్మెంట్, స్కాలర్ ఫిప్ ల‌ను వెంటనే విడుదల చేయాలి.
  4. రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాలను వెంటనే ప్రారంభించాలి.
  5. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ, ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసి ఫీజులపై విడుదల చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటన కార్యదర్శి ఏ శ్రీకాకుళం నగర కార్యదర్శి యోగేశ్వరరావు, వంశీ, ఏం.జగన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

9న సిఐటియు కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం

Satyam NEWS

దుబ్బాక నుండే టిఆర్ఎస్ పతనం ప్రారంభం

Satyam NEWS

పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకిన మాజీ సర్పంచి

Satyam NEWS

Leave a Comment