అవినీతి నిరోధక శాఖ వలపన్ని మరో అవినీతిపరుడిని పట్టుకున్నది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఆఫీస్ పైన నేడు ఏసిబి దాడులు చేసింది. ఈ దాడిలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ దొరికి పోయారు.
నర్సంపేట పట్టణానికి చెందిన కొప్పు అశోక్ బిల్డింగ్ వాల్యుయేషన్ సర్టిఫికెట్ కోసం లంచం అడగగా తను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్నారు. 5000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.