42.2 C
Hyderabad
April 26, 2024 17: 33 PM
Slider నిజామాబాద్

ఏసీబీకి చిక్కిన రామరెడ్డి ఇంచార్జి తహసీల్దార్

పాస్ బుక్ పేరు మార్పు కొసం 10 వేలు డిమాండ్: ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ధరణి పోర్టల్ తీసుకువచ్చామని, రైతులు తమ సమస్యలు సత్వరమే పరిష్కరించుకోవాలని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధంగా ఉంది. రెవిన్యూ శాఖలో అధికారుల అవినీతికి సామాన్య ప్రజలు బలవుతూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తహసీల్దార్ మానస ఏసీబీకి చిక్కారు. ఓ రైతు తన పెద్దమ్మకు చెందిన భూమిని తన పేరిట మార్చుకోవడానికి తహసీల్దార్ 10 వేలు డిమాండ్ చేయగా ఇవ్వలేనని బాధిత రైతు చెప్పగా చివరికి 4 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ డబ్బులు కూడా ఇవ్వలేని ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఎసిబి డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మనడలంలోని అన్నారం గ్రామానికి చెందిన దన్నపు రాజవ్వ కొద్దిరోజుల క్రితం మృతి చెందింది. ఆమెకు వారసులు లేరు. దాంతో తన పెద్దమ్మ పేరున ఉన్న 0.37 గుంటల భూమి తన పేరున మార్పిడి చేయాలని మండ్ల బలరాం తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇద్దరి ఇంటిపేరు వేరుగా ఉండటంతో బాధిత రైతును తహసీల్దార్ నేరుగా డబ్బులు డిమాండ్ చేయకుండా పట్టా మార్పిడికి 5 వేలు ఇవ్వాల్సిందిగా కార్యాలయ ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా బలరాంకు తెలిపారు. తనతో డబ్బులు కావని చెప్పినా 4 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకోగా అవికూడా ఇవ్వలేని బలరాం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడు 4 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు మధ్యాహ్నం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని డిఎస్పీ తెలిపారు.

10 వేలు డిమాండ్ చేశారు:బాధిత రైతు బలరాం

మా పెద్దమ్మ చనిపోతే ఆ భూమి నా పేరున పౌతి మార్పిడి చేయాలని తహసీల్దార్ ను కలిశాను. ఇంటిపేరు వేరుగా ఉండటంతో 10 వేలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ అడగకుండా ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా ఆడిగించారు. నాతో కావని చెప్పాను. 5 వేలు అడిగారు. చివరికి 4 వేలైనా ఇవ్వాలని అనడంతో ఒకే అన్నాను. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

బాధితుడు బలరాం

Related posts

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సర్వసభ్య సమావేశం

Satyam NEWS

విశ్వక్సేన్ సినిమాస్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

Bhavani

మూగబోయిన పాటకు…

Satyam NEWS

Leave a Comment