28.7 C
Hyderabad
April 28, 2024 09: 32 AM
Slider నల్గొండ

ప్రజల సమస్యలు ఆలకించిన అడిషనల్ కలెక్టర్

#Additional Collector Suryapet

తాము ఎదుర్కొంటున్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి తీసుకొచ్చారు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన ప్రజలు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున స్థానిక 7వ వార్డులో గల భవాని నగర్ లో ఆయన పర్యటించిన సందర్భంగా ప్రజలు ఆయనను కలిసి సమస్యలను వివరించారు.

తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీరు నిల్వ పెరిగి పోయి అంటు రోగాలు ప్రబలుతున్నాయని, విష సర్పాలు వస్తున్నాయని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీధి దీపాలు వెలగడం లేదని, మిషన్ భగీరథ పనులు సవ్యంగా నడవడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమస్యలను ఆలకించిన ఆయన మున్సిపల్ కౌన్సిలర్ ఏ ప్రభాకర్ ను సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కృష్ణారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కూరేళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు పందిరి గీత, జిట్టా పద్మ బొందయ్య, సిలివేరు మౌనిక శేఖర్, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు మెండే సైదులు. ఎండి జమీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర హోం శాఖ రక్షణ కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

Satyam NEWS

ఆర్ట్ గ్లోబ్ గాడ్జెట్స్ & మోర్ షాపు ప్రారంభం

Satyam NEWS

ప్రకృతి వైద్యంలో కొత్త పుంతలు తొక్కే శాంతిగిరి

Satyam NEWS

Leave a Comment