వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వాన్ని వదులుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయడం భారత రాజ్యాంగాన్ని, ప్రజలను మోసగించడమే అవుతుందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ లోని అయన స్వగృహం లో బుధవారం మీడియా తో అది శ్రీనివాస్ మాట్లాడుతూ మచ్చ లేని కుటుంబమని చెప్పుకునే రమేష్ బాబు తన ప్రవర్తనతో , తప్పులతో ఆ కుటుంబానికి కలంకం తీసుకు వచ్చాదాని విమర్శించారు.
రమేష్ బాబు భారత చట్టాలలోని నిబంధనలు ఉల్లంఘించారని ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని గత 2019 డిసెంబర్ 16 వరకు కూడా ఆయన జర్మనీ పాస్ పోర్ట్ పైనే చెన్నై నుంచి జర్మనీ దేశానికి వెళ్లరని ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించి కోర్టుకు తగిన ఆధారాలు చూపించినప్పటికీ అయన ఇంకా తన జెర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నానని బొంకుతున్నదని అయన విమర్శించారు.దీనిని బట్టి రమేష్ బాబు కు జర్మనీ,ఇండియా రెండు దేశాల పాస్ పోర్ట్ లు ఉన్నట్టుగా అర్థమవుతోందన్నారు.
జర్మనీ పౌరసత్వం ఉన్న వ్యక్తికి తెలంగాణ లో ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని ఆయన తెరాసా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని,చట్టాన్ని,ప్రజలను మోసం చేస్తున్న రమేష్ బాబు ఫై చర్యలు తీసు కోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. రెండు పాస్స్పోర్టులు కలిగిన మామూలువ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు రమేష్ బాబు ఫై ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారో చెప్పాలని మామూలు ప్రజలకు ఒక న్యాయం ఎమ్మెల్యేకు ఒక న్యాయమా అయన ప్రశ్నించారు.ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ ,సంద్రగిరి శ్రీనివాస్,సంగ స్వామి,తదితరులు ఉన్నారు.