40.2 C
Hyderabad
April 29, 2024 16: 09 PM
Slider ముఖ్యంశాలు

ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలి

#openschool

ములుగు జిల్లాలోని చిరుద్యోగులకు, గృహిణులకు, చిన్నతనంలో చదువుకునే అవకాశం లేకుండా ఉన్న నిరక్షరాస్యులు నేరుగా పదవ తరగతి చదువుకునే వరం ఓపెన్ స్కూల్ ద్వారా ఉందని ములుగు జిల్లా విద్యా శాఖాధికారి జి.పాణిని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలో అర్హత ఉన్న వారు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ లలో సంప్రదించాలని సూచించారు.

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు 14 ఆగస్టు 2022 లోగా, అపరాధ రుసుముతో  29 ఆగస్ట్ 2022 వరకు  స్టడీ సెంటర్ లో గానీ, ఆన్లైన్ లో గానీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందులో వృత్తి విద్యా కోర్సులు కూడా ఉంటాయని, అవసరం ఉన్నవారు వాటికి కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా అన్ని వివరాలతో కూడిన పోస్టర్, కరదీపిక, ప్రోస్పెక్టస్ ను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు బద్దం సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, DCEB కార్యాదర్శి ఎన్నెమ్ విజయమ్మ, జిల్లా సైన్స్ అధికారి, ACGE అప్పని జయదేవ్, సహాయ కార్యదర్శి యాసం విక్రమ్ రాజ్, ఉపాధ్యాయులు శిరుప సతీశ్ కుమార్, వేం యాకుబ్ రెడ్డి, బానోత్ దేవ్ సింగ్, సానికొమ్ము ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో పీఎం మోడీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

బాసర అమ్మవారికి బంగారు ముత్యాల మిశ్రమ హారం

Satyam NEWS

కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment