40.2 C
Hyderabad
April 29, 2024 18: 55 PM
Slider గుంటూరు

చెత్త పన్ను రద్దు చేసే వరకు ఆందోళన తీవ్రతరం

#garbage tax

రాష్ట్ర ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దు చేసే వరకు ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బుధవారం చెత్త పన్ను రద్దు చేయాలని, నీటి కులాయిలకు పెట్టే మీటర్లను ఉపసంహరించుకోవాలని, ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, టిడిపి, సిపిఐ ఎంఎల్, చాంబర్ ఆఫ్ కామర్స్, కాంగ్రెస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి గౌతమ్ బుద్ధ రోడ్, మిద్దె సెంటర్, మెయిన్ బజార్, గాలిగోపురం మీదగా కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్యా మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా చెత్త పన్ను విధించలేదని విమర్శించారు. చెత్త పై పన్ను విధించిన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో చెత్త పై పన్ను వేయడం దారుణమైన అన్నారు. పన్ను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో పరిపాలన ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల జరపకుండా కార్పొరేషన్ పెట్టి వ్యక్తులు పాలన చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలపై భారాల మోపే సమస్యలను పట్టించుకోకుండా ఏదో పరిష్కారం చేస్తున్నట్టు ప్రచారం పొందుతున్నారని విమర్శించారు. ప్రజల పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారి సమస్యలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కార్పొరేషన్ అసలు ఏర్పడిందా లేదా అనేది కూడా అనుమానంగా ఉందని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ నీటి కుళాయిలకు మీటర్లు పెట్టి వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి బాణాలు మోపుతున్నారని విమర్శించారు. కరెంటు చార్జీలు విపరీతంగా పెంచారని విమర్శించారు. చెత్త పై పన్ను విధించిన ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని అన్నారు. టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ ప్రజలపై భారాలను మోపి ప్రభుత్వాన్ని నిలదీయాలని విమర్శించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల భారం పెంచుతున్నారని తెలిపారు. ప్రశ్నించే వారిపై గొంతు నొక్కెందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమస్తామని హెచ్చరించారు. సిపిఐ ఎంఎల్ నాయకులు కూరపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ చెత్త పై పన్ను వసూలు చేసే బాధ్యతను వాలంటీర్లకు చెప్పారని అన్నారు.

పన్ను వసూలు చేయకపోతే వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల కాశయ్య, నందం బ్రహ్మేశ్వరావు, జాలాది జాన్ బాబు, ఏ ప్రభాకర్, కే ఈశ్వర్ రావు, తాడేపల్లి సహాయ కార్యదర్శి తుడిమెళ్ళ వెంకటరామయ్య సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్, ఎం బాలాజీ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, పట్టణ నాయకులు మున్నంగి చలపతిరావు, కే నాగేశ్వరావు,

చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి రామారావు, టిడిపి నాయకులు దామర్ల రాజు, గోవాడ దుర్గారావు, గోశాల రాఘవ, తోట పార్థసారథి, ఎండి ఇబ్రహీం, షేక్ హుస్సేన్, షేక్ సుభాని, వాకా మాధవరావు, షేక్ రియాజ్, టి హరికృష్ణ, అబ్దుల్ మజీద్, సిపిఐ ఎంఎల్ నాయకులు కే ఆదినారాయణ, డి దుర్గాప్రసాద్, దళిత సంఘాల నాయకులు బి గోవిందరాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కాటమరాజు, జి వెంకయ్య, ఎస్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనాని తరిమి కొడదాం

Satyam NEWS

నరసరావుపేట నియోజకవర్గంలో టిడిపి ఎన్నికలు పూర్తి

Satyam NEWS

టోల్ ప్లాజా ప్రారంభం తో ప్రజల ఆగ్రహం

Murali Krishna

Leave a Comment