38.2 C
Hyderabad
April 28, 2024 22: 25 PM
Slider నిజామాబాద్

దేశానికి అన్నం పెట్టే రైతులకు ప్రోత్సాహం కరవు

#AIKMS

దేశానికి అన్నం పెడుతున్న రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) జిల్లా కార్యాదర్శి సురేష్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్న ,చిన్నకారు రైతులను విస్మరిస్తున్నాయని అందుకే రైతు చేసే పోరాటానికి అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS)అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

రైతు అన్నం పెడితేనే దేశం బతుకుతందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు 1.63 లక్షల కోట్లు ప్రకటించింది కానీ ఇది కంటితుడుపు చర్య తప్ప వేరొకటి కాదని ఆయన అన్నారు. ఆ డబ్బులు రైతులకు అందే వీలు లేదని అందువల్ల రైతుకు అన్యాయం జరుగుతున్నదని ఆయన అన్నారు.

పోరాటాలకు సన్న,చిన్నకారు  రైతులు సిద్దంకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో AIKMS నాయకులు బాలయ్య,చిన్న భూమన్న, అశన్న రైతులు నర్సయ్య,రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

సిమెంట్ రోడ్డు పనులను శంకుస్థాపన

Satyam NEWS

ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణం

Bhavani

Leave a Comment