33.7 C
Hyderabad
April 29, 2024 00: 56 AM
Slider ఆదిలాబాద్

స్టాఫ్ నర్సులను పట్టించుకోని రిమ్స్ డైరక్టర్

#AITUC Adilabad

నాలుగు నెలల నుండి వేతనాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రిమ్స్ డైరెక్టర్ గాని అధికారులు గాని పట్టించుకోకపోవడం బాధాకరమని AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్  యూనియన్ జిల్లా కార్యదర్శి P రమేష్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి బ్రాంచ్ కార్యాలయంలో ప్రెస్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. దేశంలో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి నేటి వరకు కరోనా మహమ్మరిని పారద్రోలడం లో ముఖ్య పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లను అశ్రద్ధ చేయడం అన్యాయమని ఆయన అన్నారు.

ఎంత చెప్పినా రిమ్స్ డైరెక్టర్ లో మాత్రం చలనం రావడం లేదని ఆయన అన్నారు. కార్మికులు అడిగినప్పుడల్లా నేను బిల్లు పంపించాను రెండు మూడు రోజుల్లో వస్తది పది రోజుల్లో వస్తది ఆగండి రెండు మూడు రోజులు ఆగండి అనుకుంటూ మభ్యపెడుతున్నరే తప్ప వేతనాలు మాత్రం ఇప్పించడం లేదని ఆయన అన్నారు.

ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకిన పేసేంట్లకు ఏవిధంగా సేవలు చేస్తారు అద్దె ఇంట్లో ఉంటున్నవారు అద్దెలు ఏవిధంగా కట్టుకుంటారు వాళ్ల పిల్లలను ఏ విధంగా పోషించుకుంటారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా రిమ్స్ డైరెక్టర్ గాని జిల్లా అధికారులు గాని వెంటనే స్పందించి స్టాఫ్ నర్స్ లు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో వచ్చేనెల ఒకటవ తారీఖు నుండి స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయ శ్రీలత కమల సుకన్య రమ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

అధికారం ముగిసే ఈ కాలంలో కొత్త కాపురం ఎందుకో…?

Satyam NEWS

కడప జిల్లాలో కోవిడ్ తో సబ్ పోస్ట్ మాస్టారు మృతి

Satyam NEWS

ప్రియాంక గాంధీని ఇరికించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment