25.2 C
Hyderabad
October 10, 2024 20: 29 PM
Slider కృష్ణ

అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం

#dgp

ఎన్.టి.ఆర్ జిల్లా లో కొత్తగా ఏర్పాటు చేసిన అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ఈ ఏరియాలలో ట్రాఫిక్ బాగా పెరిగింది.  పెరిగిన రద్దీ దృష్ట్యా, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు కూడా 10 నుండి 15 శాతం వరకు తగ్గాయి. వాహనదారులు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

అనంతరం డి.జి.పి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ ఎం.ఎల్.ఏ మల్లాది విష్ణు చాలా సార్లు గుణదల లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ కోసం, అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ల ఏర్పాటు విషయమై చర్చించడం జరిగింది.  గతంలో గుణదల లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. 13 సంవత్సరాల క్రితం ఇక్కడ పోలీస్ కమీషనర్ గా చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఈ ఏరియాలలో చాల మార్పు వచ్చింది. ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. హైదరాబాద్ వెళ్ళు వాహనాలు కూడా రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ ఏరియా మీదుగా వెళతాయి. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ఎం.ఎల్.ఏ మల్లాది విష్ణు, మునిసిపల్ కమీషనర్ సహకరించడం జరిగింది.

అదే విధంగా నందిగామ మరియు జగ్గయ్యపేట లలో కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు.  నగరంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. గత రెండు నెలలుగా అధికారులు వివిధ ఏరియాలను తిరిగి ఏ సమయాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ ప్రదేశాలలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది అన్న విషయాలపై వివరాలను సేకరించడం జరిగింది. దానికి అనుగుణంగా పలు మార్పులను చేయడం జరిగింది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎం.ఎల్.ఏ మల్లాది విష్ణు, డిప్యూటీ పోలీస్ కమీషనర్లు విశాల్ గున్ని, అజిత వేజెండ్ల,  మోకా సత్తిబాబు, మునిసిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఏ.డి.సి.పి.లు సి.హెచ్. లక్ష్మీపతి, పి.వెంకట రత్నం, జి.రమణమూర్తి, డి.ప్రసాద్,  నగర మేయర్ రాయన బాగ్యలక్షి,   నార్త్ ఏ.సి.పి. సి.హెచ్. రవికాంత్, ట్రాఫిక్ ఏ.సి.పి. జి.శ్రీనివాస రావు, ఇతర ఏ.సి.పి.లు   ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

Satyam NEWS

ప్రభాస్ సినిమాకు జగన్ ప్రభుత్వం వెసులుబాటు

Satyam NEWS

మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణం

Satyam NEWS

Leave a Comment