39.2 C
Hyderabad
April 28, 2024 14: 16 PM
Slider ప్రత్యేకం

కౌన్ బనేగా కామారెడ్డి బాద్ షా

#kamareddy

ఎమ్మెల్యే బరిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, వెంకట రమణారెడ్డి

ఎన్నికలు పూర్తయ్యేవరకు ఒకెత్తు అయితే రిజల్ట్ వచ్చేదాకా మరొక ఎత్తు అన్నట్టు ఉంది కామారెడ్డి రాజకీయం. నిన్న ఎన్నికలు ముగిసాయో లేదో ఇవాళ బెట్టింగ్ లు మొదలుపెట్టారు. కామారెడ్డి నియోజకవర్గం అంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉన్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు మొత్తం కలిసి 39 మంది అభ్యర్థులు కామారెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగుల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

కామారెడ్డిలో 76 శాతం పోలింగ్

కామారెడ్డి నియోజకవర్గంలో 2,52,460 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నిన్న జరుగిన ఎన్నికల్లో 1,90,811 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 89,936 మంది పురుషులు, 100866 మహిళలు, 9 మంది ట్రాన్స్ జెండర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 75.58 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో కొత్తగా 40 వేలకు పైగా ఓటు హక్కును కలిగి  ఉన్నారు.

గెలుపెవరిదో.. ఓటమి ఎవరిదో

సిట్టింగ్ సీఎంగా ఉన్న కేసీఆర్, టీపీసీసీ చీఫ్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ వెంకట రమణారెడ్డి కామారెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు సీఎం అభ్యర్థులు కాగా మరొకరు మాజీ జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్నారు. సీఎం అభ్యర్థులకు గట్టి పోటీగా వెంకట రమణారెడ్డి నిలిచారన్న ప్రచారం సాగుతోంది. ఒకానొక సమయంలో తమ ప్రత్యర్థి అతనే అనేలా పోటీ జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ సాగగా గెలుపెవరిది.. ఓటమి ఎవరిది అన్న చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డి గెలుస్తారని చెప్తుండగా తమదే గెలుపు అని కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా చెప్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డిలో గెలిచేదెవరు.. ఒడేదెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.

హ్యాట్రిక్ కొట్టేదెవరు..?

ఒకరు సిట్టింగ్ సీఎం, మరొకరు కాబోయే సీఎం అంటూ ప్రచారంలో ఉన్న నాయకుడు, ఇంకొకరేమో సామాన్య వ్యక్తి.. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా కామారెడ్డి చరిత్రకు పునాది కానుంది. సీఎం కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి ప్రజలు ఆధరించారని, సీఎంకు ఎక్కడికెళ్లినా గెలుపు తప్ప ఓటమి ఉండదని చెప్పుకునే అవకాశం ఉంటుంది. టిపిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గెలిస్తే సిట్టింగ్ సీఎంను ఢీకొట్టిన వ్యక్తిగా ప్రత్యేకత చాటుకొనున్నారు. వీరిద్దరూ కాకుండా వెంకట రమణారెడ్డి గెలిస్తే మాత్రం సీఎం అభ్యర్థులను ఓడించిన నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరు మారుమ్రోగనుంది. మరి కామారెడ్డి హ్యాట్రిక్ ఎవరి దక్కుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

ఈవిఎంలలో అభ్యర్థుల భవితవ్యం

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అందరి చూపు కామారెడ్డి వైపే ఉండనడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల ఓటింగ్ పూర్తయింది. ప్రజలు తమ తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. తెల్లవారితే ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓటమి పాలు కానున్నారు అనేది తెలియనుంది. ఇప్పటికే మూడు పార్టీల అభ్యర్థులు, నాయకులు ఆమె గెలుపు పక్కా అనే ధీమాలో ఉన్నారు.

కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి, ఎస్పీ కార్యాలయానికి మధ్య ఉన్న వ్యవసాయ గోదాములో అధికారులు ఈవీఎంలు భద్రపరిచారు. రేపటి కౌంటింగ్ కూడా అక్కడే జరగనుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించనున్నారు. ఉదయం 10 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కోసం 75 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 54 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 62 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియజకవర్గాల లెక్కింపు జరగనుంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

డెవెలప్మెంట్ ఫండ్స్: రూ.50 కోట్లనిధులతో పలు అభివృద్ది పనులు

Satyam NEWS

ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు

Bhavani

ఎకరాకు ఒక్క బస్తా యూరియా చాలు

Satyam NEWS

Leave a Comment